పేలవంగా ఆడిన చెన్నై.. రాజస్థాన్ ఎదుట స్వల్ప విజయ లక్ష్యం

ABN , First Publish Date - 2020-10-20T03:05:09+05:30 IST

ప్లేఆఫ్ బరిలో నిలవాలంటే గెలవక తప్పని పరిస్థితుల్లో బరిలోకి దిగిన రెండు జట్ల మధ్య పోరు రసవత్తరంగా ఉంటుందని భావించిన సగటు ప్రేక్షకుడికి నిరాశే మిగిలింది. అబుదాబిలో

పేలవంగా ఆడిన చెన్నై.. రాజస్థాన్ ఎదుట స్వల్ప విజయ లక్ష్యం

అబుదాబి: ప్లేఆఫ్ బరిలో నిలవాలంటే గెలవక తప్పని పరిస్థితుల్లో బరిలోకి దిగిన రెండు జట్ల మధ్య పోరు రసవత్తరంగా ఉంటుందని భావించిన సగటు ప్రేక్షకుడికి నిరాశే మిగిలింది. అబుదాబిలో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై జట్లు పేలవంగా ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసి ప్రత్యర్థి ఎదుట స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. చెన్నై బ్యాట్స్‌మన్‌లలో ఒక్కరంటే ఒక్కరు కూడా బ్యాట్ ఝళిపించలేకపోయారు. 


పరుగులు రాబట్టాలన్న తపన వారిలో కొంచెం కూడా కనిపించకపోవడం గమనార్హం. మ్యాచ్‌లను ఒంటి చేత్తో గెలిపించే శామ్ కరన్, డుప్లెసిస్, వాట్సన్, రాయుడు, ధోనీ, జడేజా వంటి ఆటగాళ్లు ఉన్న జట్టులో మ్యాచ్ మొత్తంలో ఒకే ఒక్క సిక్సర్ నమోదు కావడం వారి ఆటతీరుకు అద్దం పడుతోంది. ధోనీ, జడేజాలు క్రీజులో ఉండడంతో పరుగుల వరద పారుతుందని భావించినా సింగిల్స్‌కే పరిమితమయ్యారు.


వంద పరుగులు రాబట్టడానికి 17 ఓవర్లు అవసరమయ్యాయంటే చెన్నై ఎంత ఘోరంగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. జట్టులో జడేజా చేసిన 35 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. అవి కూడా 30 బంతుల్లో 4 ఫోర్లతో సాధించాడు. శామ్ కరన్ 22, డుప్లెసిస్ 10, వాట్సన్ 8, రాయుడు 13, ధోనీ 28 పరుగులు చేశారు. 

Updated Date - 2020-10-20T03:05:09+05:30 IST