విదేశీ ఆటగాళ్ల అండతో..

ABN , First Publish Date - 2020-09-16T09:39:45+05:30 IST

ఎలాంటి అంచనాలు లేకుండానే ఆరంభ సీజన్‌లో విజేతగా నిలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఆ తర్వాత మళ్లీ అలాంటి మ్యాజిక్‌ చేయలేకపోయింది

విదేశీ ఆటగాళ్ల అండతో..

ఐపీఎల్‌ ప్రదర్శన

2008  విజేత 2013, 2015, 2018 ప్లేఆఫ్స్‌


ఎలాంటి అంచనాలు లేకుండానే ఆరంభ సీజన్‌లో విజేతగా నిలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఆ తర్వాత మళ్లీ అలాంటి మ్యాజిక్‌ చేయలేకపోయింది. లీగ్‌ ఎప్పుడు ఆరంభమైనా ఈ జట్టును ఫేవరెట్‌గా మాత్రం పరిగణించరు. ఎక్కువగా పేరు లేని ఆటగాళ్లతోనే బరిలోకి దిగడం ఈ జట్టుకు అలవాటు. సమష్టిగా ఆడలేకపోవడం వీరి బలహీనత. 2008లో చాంపియన్‌ అయ్యాక మరో మూడుసార్లు ప్లేఆ్‌ఫ్సకు రాగలిగింది. గతేడాది మరీ దారుణంగా ఏడో స్థానంలో నిలిచింది. ఈసారి విదేశీ ఆటగాళ్ల అండతోనైనా రెండో టైటిల్‌ సాధించాలనే కసితో ఉంది.  

బలం: జోస్‌ బట్లర్‌, స్టీవ్‌ స్మిత్‌, బెన్‌ స్టోక్స్‌ రూపంలో మ్యాచ్‌ విన్నర్లకు కొదవ లేదు. టాప్‌ ఆర్డర్‌లో సంజూ శాంసన్‌ కీలకం కానున్నాడు. ఈసారి వేలంలో రాబిన్‌ ఊతప్పను తీసుకున్నారు. డేవిడ్‌ మిల్లర్‌ ఫినిషర్‌గా ఉపయోగపడతాడు. స్వదేశీ యువ ఆటగాళ్లు రియాన్‌ పరాగ్‌, యశస్వి జైస్వాల్‌, మనన్‌ వోహ్రా, శ్రేయాస్‌ గోపాల్‌ సత్తా కలిగిన వారే. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌, థామస్‌, ఉనాద్కట్‌లతో పదునుగా కనిపిస్తోంది.

బలహీనత: తండ్రి అనారోగ్యరీత్యా న్యూజిలాండ్‌లో ఉన్న స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఆడేది అనుమానమేనని కోచ్‌ మెక్‌డొనాల్డ్‌ స్పష్టం చేయడంతో జట్టు ఆందోళనలో ఉంది. ఇక ప్రతీ విభాగంలోనూ విదేశీ ఆటగాళ్లపైనే ఆధారపడుతుంటుంది. స్వదేశీ ఆటగాళ్లలో అనుభవలేమి కనిపిస్తోంది. అజింక్యా రహానెను వదులుకోవడం ఏమేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి. 


రాజస్థాన్‌ జట్టు

స్వదేశీ ఆటగాళ్లు: సంజూ శాంసన్‌, మనన్‌ వోహ్రా, అంకిత్‌ రాజ్‌పుత్‌, మార్కండే, తెవాటియా, పరాగ్‌, శశాంక్‌ సింగ్‌, శ్రేయాస్‌ గోపాల్‌, వరుణ్‌ ఆరోన్‌, ఊతప్ప, ఉనాద్కట్‌, జైస్వాల్‌, అనుజ్‌ రావత్‌, ఆకాశ్‌ సింగ్‌, కార్తీక్‌ త్యాగి, అనిరుధ జోషి, లొమ్రోర్‌. 

విదేశీ ఆటగాళ్లు: స్మిత్‌, స్టోక్స్‌, ఆర్చర్‌, బట్లర్‌, మిల్లర్‌, ఒషానో థామస్‌, ఆండ్రూ టై, టామ్‌ కర్రాన్‌.

Updated Date - 2020-09-16T09:39:45+05:30 IST