Abn logo
Jan 26 2021 @ 23:20PM

బర్డ్ ఫ్లూ: రాజస్థాన్‌లో మరో 90 పక్షులు మృతి

జైపూర్: పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న తరుణంలో రాజస్థాన్‌లో మరో 90 పక్షులు మృతి చెందినట్టు రాష్ట్ర పశు సంవర్థక శాఖ వెల్లడించింది. మృతి చెందిన పక్షుల్లో 56 కాకులు, 12 నెమళ్లు, 14 పావురాలు, ఇతర పక్షులు ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది. మొత్తంగా బర్డ్ ఫ్లూ వెలుగుచూసిన 2020 డిసెంబర్ 25 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 6,849 పక్షులు మృత్యువాత పడినట్టు తెలిపింది. ‘‘మృతి చెందిన పక్షుల్లో 4,799 కాకులు, 409 నెమళ్లు, 583 పావురాలు, 1058 ఇతర పక్షులు ఉన్నాయి. 17 జిల్లాల్లో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా (బర్డ్ ఫ్లూ) నిర్ధారణ అయ్యింది...’’ అని పశు సంవర్థక శాఖ తెలిపింది. 

Advertisement
Advertisement
Advertisement