నొప్పితో ఖైదీ విలవిల! అక్కడ 4 ఫోన్లను చూసి అధికారులు షాక్!

ABN , First Publish Date - 2020-09-20T18:18:15+05:30 IST

ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా 4 మొబైల్ ఫోన్లు..పోలీసుల కంట పడకుండా తన పురీషనాళంలో దాచుకున్నాడో ఖైదీ. కానీ..అతడి కడుపులో కలకలం రేగడంతో బండారం మొత్తం బట్టబయలైంది.

నొప్పితో ఖైదీ విలవిల! అక్కడ 4 ఫోన్లను చూసి అధికారులు షాక్!

జైపూర్: ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా 4 మొబైల్ ఫోన్లు..పోలీసుల కంట పడకుండా తన పురీషనాళంలో దాచుకున్నాడో ఖైదీ. కానీ..అతడి కడుపులో కలకలం రేగడంతో బండారం మొత్తం బట్టబయలైంది. జోధ్‌పూర్ సెంట్రల్‌ జైల్లో ఈ దారుణం జరిగింది. మరో నేరంపై గత 18 నెలలుగా జైల్లో ఉంటున్న దేవ రామ్ అనే ఖైదీ ఈ చర్యకు తెగబడ్డాడు. శుక్రవారం రాత్రి, దేవ్‌ రామ్ కడుపులో, పురీషనాళంలో తీవ్రమైన నొప్పి వస్తోందంటూ అతడు విలవిల్లాడాడు.


 ‘ఏం జరిగిందని ప్రశ్నిస్తే.. అతడు తాను చేసిన నిర్వకాన్ని బయటపెట్టాడు. బలవంతంగా పురీషనాళంలోకి నాలుగు ఫోన్లను దూర్చుకున్నట్టు తెలిపాడు’ అని జోధ్‌పూర్ జైలు సూపరింటెండెంట్ తెలిపారు. ఆస్పత్రిలో డాక్టర్లు సదరు ఖైదీకి ఎక్స్‌రే, సోనోగ్రఫీ పరీక్షలు నిర్వహించగా..అతడి శరీరంలో ప్లాస్టిక్ కవర్ చుట్టిన నాలుగు మొబైల్ ఫోన్లు ఉన్నట్టు బయటపడింది.


చిన్న శస్త్రచికిత్స ద్వారా వైద్యులు వాటిని తొలగించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. నిందితుడు పూర్తిగా కోలుకున్నా..ఫోన్లు ఎలా అతడి చేతికి వచ్చాయే తెలుసుకునేందుకు దేవరామ్‌ను ప్రశ్నించాలని జైలు అధికారులు భావిస్తున్నారు.  


Updated Date - 2020-09-20T18:18:15+05:30 IST