రాజస్థాన్‌ బీజేపీ ఎమ్మెల్యేలు గుజరాత్‌కు

ABN , First Publish Date - 2020-08-10T08:02:35+05:30 IST

రాజస్థాన్‌ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 14న ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ తమ ఎమ్మెల్యేలు పలువురిని గుజరాత్‌కు తరలిస్తోంది. ఇప్పటివరకు 18 మంది ఎమ్మెల్యేలు తరలి వెళ్లగా...

రాజస్థాన్‌ బీజేపీ ఎమ్మెల్యేలు గుజరాత్‌కు

  • అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తరలింపు
  • విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్న గెహ్లోత్‌ సర్కారు!

జైపూర్‌/అహ్మదాబాద్‌, ఆగస్టు 9: రాజస్థాన్‌ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 14న ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ తమ ఎమ్మెల్యేలు పలువురిని గుజరాత్‌కు తరలిస్తోంది. ఇప్పటివరకు 18 మంది ఎమ్మెల్యేలు తరలి వెళ్లగా.. వారిలో ఆరుగురు ఆదివారం అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. రాజస్థాన్‌లో 18 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సచిన్‌ పైలట్‌ నేతృత్వంలో తిరుగుబాటు చేయడం, దీంతో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో గెహ్లోత్‌ సర్కారు విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిన సూచనలు కనిపిస్తుండటంతో బీజేపీ తమ ఎమ్మెల్యేలను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం పోరుబందర్‌కు వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు ఆదివారం సోమ్‌నాథ్‌కు చేరుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తమను వేధిస్తోందని, స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ను ఉపయోగించుకుని ఒత్తిడి చేస్తోందని, మానసిక ప్రశాంతత కోసం తాము సోమ్‌నాథ్‌ దర్శనానికి వచ్చామని ఓ ఎమ్మెల్యే చెప్పారు.


Updated Date - 2020-08-10T08:02:35+05:30 IST