మిలటరీ ఉద్యోగి పాక్ మహిళతో whatsappలో అశ్లీల చాటింగ్‌లో ఏం చేశాడంటే...

ABN , First Publish Date - 2021-10-15T13:12:38+05:30 IST

ఓ మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసు ఉద్యోగి పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ మహిళతో వాట్సాప్ చాటింగ్ చేసిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో సంచలనం రేపింది....

మిలటరీ ఉద్యోగి పాక్ మహిళతో whatsappలో అశ్లీల చాటింగ్‌లో ఏం చేశాడంటే...

    అశ్లీల సంభాషణ, గూఢచర్యం చేసిన వైనం...నిందితుడి అరెస్ట్ 

జైపూర్ (రాజస్థాన్): ఓ మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసు ఉద్యోగి పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ మహిళతో వాట్సాప్ చాటింగ్ చేసిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో సంచలనం రేపింది. జైపూర్ నగరంలోని మిలటరీ చీఫ్ ఇంజినీరు కార్యాలయంలో గజేంద్రసింగ్ (35) నాల్గవతరగతి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.గజేంద్రసింగ్ పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ మహిళతో పరిచయం పెంచుకొని ఆమెతో తరచూ వాట్సాప్ చాటింగ్ చేస్తున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో జైపూర్ పోలీసులు గజేంద్రసింగ్ పై నిఘా వేయగా మిలటరీ ఇంజినీరింగ్ కార్యాలయంలోని ముఖ్యమైన ఫైళ్లు, లేఖలను తన మొబైల్ ఫోన్ తో క్లిక్ చేసి వాటిని వాట్సాప్ లో పాక్ మహిళకు పంపించాడని దర్యాప్తులో తేలింది. 


జోధ్ పూర్ నగరంలో ఉన్న గజేంద్రసింగ్ ను పోలీసులు, నిఘా సంస్థలు నిర్భంధించాయి. గజేంద్రసింగ్ మొబైల్ ఫోన్ వాట్సాప్ చాటింగ్ ను పరిశీలించగా పాక్ మహిళతో అసభ్యకరంగా చాట్ చేశాడని, దీంతోపాటు పలు ఆర్మీ కీలక పత్రాలను పాక్ మహిళకు పంపించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు గజేంద్ర సింగ్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి ఉమేశ్ మిశ్రా చెప్పారు.


Updated Date - 2021-10-15T13:12:38+05:30 IST