పట్టణాల్లో ఆవులను పెంచుకోవాలంటే లైసెన్స్ తప్పనిసరి

ABN , First Publish Date - 2022-04-18T16:09:21+05:30 IST

పట్టణాల్లో ఆవులు, గేదెల పంపకంపై రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది....

పట్టణాల్లో ఆవులను పెంచుకోవాలంటే లైసెన్స్ తప్పనిసరి

రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు

జైపూర్ (రాజస్థాన్): పట్టణాల్లో ఆవులు, గేదెల పంపకంపై రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో ఆవులు, గేదెలను పెంచుకోవడానికి లైసెన్స్‌లను తప్పనిసరి చేసింది.లైసెన్సు లేకుండా ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ ఆవులు, దూడలను ఉంచుకోవడానికి అనుమతించబోమని అధికారులు తెలిపారు.పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లలో ఆవులు లేదా గేదెలను పెంచుకోవడానికి రాజస్థాన్ ప్రభుత్వం వార్షిక లైసెన్స్,  100 చదరపు గజాల విస్తీర్ణం తప్పనిసరి చేసింది. జంతువులు దారితప్పినట్లు తేలితే పదివేల రూపాయల వరకు జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు.


పశువులకు ప్రత్యేక నిర్దేశిత ప్రాంతం ఉండాలి. కొత్త నిబంధనలను మున్సిపల్ కార్పొరేషన్లు, కౌన్సిల్‌ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అమలు చేయనున్నారు. ఆవు లేదా గేదె పెంచుకోవడానికి వార్షిక లైసెన్స్ ఫీజుగా వెయ్యిరూపాయలు వసూలు చేయనున్నారు. ఆవు, దూడ కంటే పశువుల సంఖ్య ఎక్కువగా ఉంటే లైసెన్స్‌ను రద్దు చేస్తారు. జంతువులకు యజమాని పేరు, నంబర్‌ను ట్యాగ్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా పశువుల మేత విక్రయాలను అనుమతించరు. అనధికారికంగా పశువుల మేత విక్రయాలపై 500 రూపాయల జరిమానా విధిస్తామని అధికారులు చెప్పారు.


పశువుల యజమాని పాలు లేదా దాని ఉత్పత్తులను విక్రయించడం వంటి వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించకూడదని అధికారులు వివరించారు.పారిశుద్ధ్యం విషయంలో రాజీపడితే 5,000 జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. ప్రతి 10 రోజులకు ఒకసారి ఆవు పేడను పురపాలక ప్రాంతం వెలుపల పారవేయాలి.ఆవు పేడను బహిరంగ ప్రదేశాల్లో ఎండబెట్టకూడదని అధికారులు పేర్కొన్నారు.


Updated Date - 2022-04-18T16:09:21+05:30 IST