Rajasthan: ధోల్పూర్ జిల్లాలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-08-20T17:57:00+05:30 IST

రాజస్థాన్ రాష్ట్రంలోని దోల్పూర్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లాలో కరోనా కట్టడి కోసం ఆంక్షలు విధించింది....

Rajasthan: ధోల్పూర్ జిల్లాలో కరోనా కలకలం

జైపూర్ : రాజస్థాన్ రాష్ట్రంలోని దోల్పూర్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లాలో కరోనా కట్టడి కోసం ఆంక్షలు విధించింది. గురువారం కొత్తగా 12 కరోనా వైరస్ కేసులు వెలుగుచూడటంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య  153కు పెరిగింది. అల్వార్, జైపూర్ జిల్లాల్లో నాలుగేసి కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. భరత్ పూర్, బికనేర్, దోల్పూర్, పాలి జిల్లాల్లో కరోనా కేసులు వెలుగుచూశాయి. రాజస్థాన్ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదుతో శుక్రవారం నుంచి 144 సెక్షన్ ను విధించారు.రాజస్థాన్ రాష్ట్రంలో బహిరంగ సభలు, సమావేశాలు, విద్యా, వినోదాత్మక సభలు, ఊరేగింపులు, పండుగలను నిషేధిస్తూ రాజస్థాన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. కర్ఫ్యూను సడలించిన తర్వాత కరోనా కేసులు పెరుగుతుండటంతో రాజస్థాన్ సర్కారు కొన్ని ఆంక్షలు విధించింది. సినిమాహాళ్లు, మల్టీప్లెక్సులు 50 శాతం ప్రేక్షకులతోనే నడుపుకునేందుకు అనుమతించారు.వివాహాలకు 25 మందిని మాత్రమే అనుమతిస్తారు.  

Updated Date - 2021-08-20T17:57:00+05:30 IST