Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 30 Mar 2022 18:11:54 IST

గర్భిణి మృతిపై ఎఫ్ఐఆర్ నమోదుతో వైద్యురాలి ఆత్మహత్య

twitter-iconwatsapp-iconfb-icon
గర్భిణి మృతిపై ఎఫ్ఐఆర్ నమోదుతో వైద్యురాలి ఆత్మహత్య

జైపూర్: గర్భిణి స్త్రీ మృతిపై తనమీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో మనస్తాపం చెందిన ఒక మహిళా వైద్యురాలు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం, డాక్టర్ అర్చనా శర్మ, ఆయన భర్త ఒక ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నారు. ఆ క్లినిక్‌లో చికిత్స తీసుకుంటున్న గర్భిణి స్త్రీ  మంగళవారంనాడు మృతి చెందింది. ఆ వెనువెంటనే ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రి వెలుపల ఆందోళనకు దిగారు. వైద్యురాలి నిర్లక్ష్యమే ఈ మృతికి కారణమంటూ ఆమెపై చర్యకు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో లాల్‌సాట్ పోలీస్ స్టేషన్‌లో డాక్టర్ అర్చనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో మనస్తాపం చెందిన అర్చన ఆసుపత్రి పైన ఉన్న తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు చేపట్టినట్టు దౌస అడిషనల్ ఎస్‌పీ లాల్ చంద్ కయల్ తెలిపారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.