ఆ రాష్ట్రంలోని 29 జిల్లాల్లో కరోనా కేసులు నిల్!

ABN , First Publish Date - 2021-08-30T11:34:10+05:30 IST

రాజస్థాన్‌లో కరోనా సెకెండ్ వేవ్ తీవ్ర రూపం చూపింది.

ఆ రాష్ట్రంలోని 29 జిల్లాల్లో కరోనా కేసులు నిల్!

జైపూర్: రాజస్థాన్‌లో కరోనా సెకెండ్ వేవ్ తీవ్ర రూపం చూపింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో అత్యల్పంగా ఏడు కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో 29 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాకపోవడం విశేషం. కేసులు ఈ విధంగా తగ్గడంతో రాష్ట్రంలోని ప్రజలకు ఉపశమనం లభించినట్లయ్యింది. 


ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 123గా ఉంది. వీరితో కొంతమంది హోమ్ ఐసొలేషన్‌లోనూ, మరికొందరు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఒక్కరు కూడా మృతి చెందలేదు. తాజాగా రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఒక్క కేసు మాత్రమే నమోదయ్యింది. రాష్ట్రంలో కరోనా కారణంగా ఇప్పటి వరకూ మొత్తం 8,954 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ, థర్ఢ్ వేవ్ వస్తుందన్న అంచనాల మేరకు వైద్యశాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

Updated Date - 2021-08-30T11:34:10+05:30 IST