Viral News: అమ్మ మాట కాదనలేక ఉదయాన్నే ఆరు రూపాయలు ఖర్చు చేసిన కానిస్టేబుల్.. సాయంత్రానికల్లా..

ABN , First Publish Date - 2022-08-04T21:04:13+05:30 IST

అతడు ఓ సాధారణ కానిస్టేబుల్. ఉద్యోగం రీత్యా కన్న వాళ్లకు, కట్టుకున్న భార్యకు దూరంగా ఉంటున్నాడు. నెల నెలా వచ్చే జీతం డబ్బులే అతడి కుటుంబానికి ఆధారం. అయితే.. తన తల్లి చెప్పిన మాట అతడి జీవితాన్నే మార్చేసింది. అమ్మ చెప్పిందని ఉదయాన్నే ఆరు రూపాయలు ఖర్చు చేసిన అతడిని

Viral News: అమ్మ మాట కాదనలేక ఉదయాన్నే ఆరు రూపాయలు ఖర్చు చేసిన కానిస్టేబుల్.. సాయంత్రానికల్లా..

ఇంటర్నెట్ డెస్క్: అతడు ఓ సాధారణ కానిస్టేబుల్. ఉద్యోగం రీత్యా కన్న వాళ్లకు, కట్టుకున్న భార్యకు దూరంగా ఉంటున్నాడు. నెల నెలా వచ్చే జీతం డబ్బులే అతడి కుటుంబానికి ఆధారం. అయితే.. తన తల్లి చెప్పిన మాట అతడి జీవితాన్నే మార్చేసింది. అమ్మ చెప్పిందని ఉదయాన్నే ఆరు రూపాయలు ఖర్చు చేసిన అతడిని సాయంత్రానికల్లా అదృష్టం పలకరించింది. దీంతో సాధారణ కానిస్టేబుల్ కాస్తా కోటీశ్వరుడిగా మారిపోయాడు. కాగా.. ఇంతకూ అతడి జీవితంలో జరిగిన మిరాకిల్ ఏంటనే పూర్తి వివరాల్లోకి వెళితే..



రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ ప్రాంతానికి చెందిన కుల్దీప్ సింగ్( Kuldeep Singh) అనే వ్యక్తి.. పంజాబ్‌లో కానిస్టేబుల్‌(constable)గా విధులు విధులు నిర్వహిస్తూ అక్కడే నివసిస్తున్నాడు. కానీ అతడి తల్లి, భార్య, 8ఏళ్ల కొడుకు మాత్రం.. రాజస్థాన్‌లోనే ఉంటున్నారు. కొడుకు పడుతున్న కష్టాన్ని చూసి.. కుల్దీప్‌కు అతడి తల్లి సుమారు ఆరు నెలల క్రితం ఓ సలహా ఇచ్చింది. లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసి అదృష్టం పరీక్షించుకుందామని అడిగింది. ఈ క్రమంలో అతడు అమ్మ మాటను కాదనలేకపోయాడు. గత ఆరు నెలలుగా లాటరీ టికెట్ కొంటూనే ఉన్నాడు. తాజాగా ఈ నెల 2న కూడా లుథియానాలోని ఓ దుకాణానికి వెళ్లాడు. అక్కడ ఒక్క టికెట్ రూ.6 చొప్పున.. రూ.150 ఖర్చు చేసి 25 నాగాలాండ్ స్టేట్ లాటరీ టికెట్లను(Nagaland State Lottery tickets) కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలో అతడిని అదృష్టం( luck) వరించింది. అదే రోజున లక్కీ డ్రా కుల్దీప్ కొనుగోలు చేసిన లాటరీ టికెట్లలో ఒకదానికి జాక్‌పాల్ తగిలింది. ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్నాడు. టికెట్ అమ్మిన దుకాణదారులు ఆగస్ట్ 2న సాయంత్రం ఫోన్ చేసి చెప్పడంతో కుల్దీప్ సింగ్ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కాగా.. ఈ న్యూస్ ప్రస్తుతం స్థానికంగా వైరల్‌గా మారింది. 

Updated Date - 2022-08-04T21:04:13+05:30 IST