పారిపోయిన 16ఏళ్ల కూతురిని పట్టుకొచ్చిన పోలీసులు.. కోర్టులో ఆమె చెప్పిన విషయం విని తల్లి షాక్.. ఇంతకీ ఏం జరిగిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-12-02T18:04:20+05:30 IST

తన కూతురును..

పారిపోయిన 16ఏళ్ల కూతురిని పట్టుకొచ్చిన పోలీసులు.. కోర్టులో ఆమె చెప్పిన విషయం విని తల్లి షాక్.. ఇంతకీ ఏం జరిగిందో తెలిస్తే..

ఇంటర్‌నెట్‌డెస్క్: తన కూతురును కిడ్నాప్ చేశారని తల్లి ఫిర్యాదు చేసింది. ఆ యువతి కోసం గాలించగా ఎనిమిది నెలల తర్వాత ఓ చోట కనిపించింది. కోర్టులో హాజరుపరచగా ఆ యువతి జరిగింది మొత్తం చెప్పింది. ఆ మాటలు విని తల్లి షాక్‌కు గురైంది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని చిత్తౌర్‌గర్ జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం మేరకు..


జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ తల్లి తన 16ఏళ్ల కూతురు కనిపించడం లేదని చిత్తౌర్‌గర్ పోలీస్‌స్టేషన్‌లో కిడ్నాప్ కేసు పెట్టింది. ఆ యువతి కోసం పోలీసులు చుట్టు పక్కల గ్రామాల్లో గాలించగా ఆమె కనిపించలేదు. కూతురు కోసం ఎన్నిసార్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. కేసును స్వీకరించిన హైకోర్టు డీఎస్‌పీని, డీజీపీని విచారణకు పిలిపించి వివరాలు అడిగింది. త్వరలోనే ఆ యువతి ఎక్కడున్న పట్టుకోవాలని ఆదేశించింది. హైకోర్టులో విచారణ అనంతరం చిత్తౌర్‌గర్ పోలీసులు ఆమె కోసం మరింతగా వెతికారు. చివరికి బుధవారం అల్వార్‌లోని ఓ గ్రామంలో పట్టుకున్నారు. ఆ యువతితో పాటు ఉన్న యువకుడిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ యువతిని కోర్టులో హాజరుపరచగా ఆమె అసలు విషయం చెప్పింది.



ఏడాదిన్నర క్రితం అల్వార్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన షేర్ సింగ్ అనే యువకుడితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని చెప్పింది. ఇంట్లో వాళ్లు తమ ప్రేమను అంగీకరించరని పారిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్పింది. మార్చి 24న ఇంటినుంచి బయటకు వచ్చి నేరుగా జైపూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నామని అక్కడి నుంచి అల్వార్‌కు వెళ్లామని చెప్పింది. ప్రస్తుతం తాను నాలుగు నెలల గర్భవతినని ఆ యువతి చెప్పింది. ఆ మాటలు విని తల్లి ఖంగుతింది. నిందితుడిని, ఆ యువతిని స్టేషన్‌కు తరలించాలని హైకోర్టు శిక్ష విధించింది. 


డీఎస్‌పీ రాజేంద్ర గోయల్ మాట్లాడుతూ 16ఏళ్ల యువతికి మాయమాటలు చెప్పి షేర్ సింగ్ అనే యువకుడు మార్చి 24న ఆమెను వాళ్ల గ్రామానికి తీసుకెళ్లాడని చెప్పారు. ఆ యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని వారి కోసం గాలించామని, బుధవారం వారిని అరెస్టు చేసి కోర్టుకు తరలించామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించామన్నారు.



Updated Date - 2021-12-02T18:04:20+05:30 IST