వివాహం జరిగిన తొలి రాత్రి గదిలో వధువు ముఖం చూసి షాకైన పెళ్లికొడుకు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-02-20T05:46:37+05:30 IST

ఒక యువకుడు పెళ్లి చేసుకోవాలని మ్యారేజ్ బ్యూరో ఏజెంట్లను కలిశాడు. వారు చూపించిన అందమైన యువతి పెళ్లిచేసుకున్నాడు. పెళ్లి చేపించేందుకు రూ.7 లక్షలు చెల్లించాడు. కానీ పెళ్లి జరిగిన తొలిరాత్రి గదిలో నవవధువు ముఖం చూడగా.. అతను పూర్తిగా మోసపోయానని గ్రహించాడు...

వివాహం జరిగిన తొలి రాత్రి గదిలో వధువు ముఖం చూసి షాకైన పెళ్లికొడుకు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

ఒక యువకుడు పెళ్లి చేసుకోవాలని మ్యారేజ్ బ్యూరో ఏజెంట్లను కలిశాడు. వారు చూపించిన అందమైన యువతి పెళ్లిచేసుకున్నాడు. పెళ్లి చేపించేందుకు రూ.7 లక్షలు చెల్లించాడు. కానీ పెళ్లి జరిగిన తొలిరాత్రి గదిలో నవవధువు ముఖం చూడగా.. అతను పూర్తిగా మోసపోయానని గ్రహించాడు. పెళ్లి జరిపించిన ఏజెంట్లకు ఫోన్ చేయగా.. వారు వెంటనే వచ్చి అతనికి మరొక షాకిచ్చారు.


వివరాల్లోకి వెళితే.. హర్యాణా రాష్ట్రానికి చెందిన ఫూల్ చంద్ అనే యువకుడు పెళ్లి చేసుకునేందకు మ్యారేజ్ బ్యూరో ఏజెంట్లను సంప్రదించాడు. వారు అతనికి రాజస్థాన్‌‌లోని భరత్‌పూర్ నగరానికి చెందిన ఒక అందమైన యువతిని చూపించారు. ఫూల్ చంద్ ఆ యువతి అందం చూసి వెంటనే పెళ్లికి అంగీకరించాడు. ఆ పెళ్లి జరిపించేందుకు ఏజెంట్లు ఫూల్‌చంద్ నుంచి రూ.7 లక్షలు తీసుకున్నారు. ఫిబ్రవరి 8న ఫూల్ చంద్ ఆ అందమైన యువతిని పెళ్లి చేసుకున్నాడు. 


రాజస్థాన్ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగేటప్పుడు వధువు ముఖంపై ఘూంగట్(చీర కొంగు) అడ్డుగా ఉంటుంది. దీంతో వరుడు ఆమె ముఖాన్ని ఆ సమయంలో చూడలేడు. ఫూల్‌చంద్ వివాహం కూడా అలాగే జరిగింది. వివాహం జరిగిన తొలి రాత్రి ఫూల్ చంద్ ఎంతో ఆశగా.. పెళ్లి కూతురు ముఖంపై నుంచి ఘూంగట్ తీశాడు. ఆ తరువాత ఒక్కసారిగా ఫూల్ చంద్ నిర్ఘాంత పోయాడు. ఫూల్ చంద్ ఇంతకుముందు చూసిన అందమైన యువతికి బదులుగా వేరే యువతి పెళ్లికూతురుగా ఉంది. ఇది చూసి ఫూల్ చంద్ తాను మోసపోయానని గ్రహించాడు. ఆ తరువాత అతని పెళ్లి జరిపించిన ఏజెంట్లకు ఫోన్ చేశాడు. వెంటనే ఆ పెళ్లి ఏజెంట్లు అక్కడికి చేరుకొని అతను ఇచ్చిన రూ.7 లక్షలకు బదులు రూ.3 లక్షలు చెల్లించి అక్కడ ఉన్న వధువుని  తీసుకెళ్లిపోయారు.


ఫూల్ చంద్ మరుసటి రోజు ఫిబ్రవరి 9న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన మోసం గురించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఫూల్ చంద్ చీటింగ్ కేసులో విచారణ చేసి ఫిబ్రవరి 15న మ్యారేజ్ బ్యూరో నడిపే నలుగురు పెళ్లి ఏజెంట్లను అరెస్టు చేశారు. వారిని ప్రశ్నించగా.. ఇంతకుముందు కూడా ఇలాంటి నకిలీ పెళ్లిళ్లు జరిపారని ఒప్పుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు.. ఆ నకిలీ పెళ్లికూతురిని కూడా పట్టుకున్నారు.


హర్యాణాలో స్త్రీల జనభా సంఖ్య కారణంగా అక్కడ పురుషులు డబ్బులు చెల్లించి యువతులను పెళ్లి చేసుకునే పరిస్థితి ఉంది. రాజస్థాన్‌లో గత కొన్ని సంత్సరాలుగా నకిలీ పెళ్లి కూతుర్ల కేసులు పెరిగిపోతున్నాయని పోలీసులు తెలిపారు.


Updated Date - 2022-02-20T05:46:37+05:30 IST