నేనేం పాపం చేశాను.. ఎందుకిలా వేధిస్తున్నావ్.. సెల్ఫీ వీడియోలో ఓ భర్త ఆవేదన ఇది.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-11-12T18:19:41+05:30 IST

భర్తతో గొడవపడి..

నేనేం పాపం చేశాను.. ఎందుకిలా వేధిస్తున్నావ్.. సెల్ఫీ వీడియోలో ఓ భర్త ఆవేదన ఇది.. అసలేం జరిగిందంటే..

ఇంటర్‌నెట్‌డెస్క్: భర్తతో గొడవపడి భార్య బయటకు వెళ్లింది. కోపం తగ్గిన తర్వాత ఇంటికి తిరిగొచ్చేసింది. కానీ, ఆమె ఇంటి తలుపు తీయగానే షాకింగ్ సీన్ కనపడింది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని భిల్వార్ పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..


స్థానిక పట్టణంలోని తిక్రీ గ్రామానికి చెందిన ఖుష్రాజ్ మీనా(30)కు, ప్రియాంక అనే మహిళతో 8ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. ఖుష్రాజ్ ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఇంటిని పోషిస్తున్నాడు. అయితే, గతకొద్ది రోజులుగా భార్యభర్తలిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. గురువారం కూడా ఖుష్రాజ్, ప్రియాంక గొడవ పడ్డారు. భర్తతో గొడవ అనంతరం ప్రియాంక బయటకు 


వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా.. ‘బయటకు వెళ్లకు.. ఏదైనా ఉంటే మాట్లాడు’ అని ఖుష్రాజ్ వేడుకున్నాడు. కానీ ఆమె వినలేదు. ఆమె బయటకు వెళ్లడం చూసి ఖుష్రాజ్‌కు ఏడుపు వచ్చింది. గుక్కపట్టి ఏడుస్తూ ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో తనకున్న బాధను మొత్తాన్ని చెప్పుకున్నాడు. ‘నేనేం పాపం చేశాను.. ఎందుకిలా వేధిస్తున్నావ్.. గొడవలు జరగడానికి కారణం నేనా? నువ్వా.? నువ్వే ఓసారి ఆలోచించుకో.. నేనెప్పుడు కూడా నిన్ను ఇబ్బంది పెట్టలేదు..’అని ఏడ్చుకుంటూ చెప్పాడు. ఆ తర్వాత వైర్‌ను గొంతుకు బిగించుకుని ఖుష్రాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. 





బయటకు వెళ్లిన ప్రియాంక కాసేపటికి ఇంటికి వచ్చింది. తలుపు తీయగానే భర్త అచేతన స్థితిలో పడి ఉండడం చూసి షాక్‌కు గురైంది. భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని తెలిసి భోరున విలపించింది. ఆమె అరుపులు విని పక్కింటివాళ్లు వచ్చారు. సెల్‌ఫోన్‌లో ఉన్న సెల్పీ వీడియో చూసి ప్రియాంక తీవ్రంగా దు:ఖించింది. ‘అయ్యో.. ఎంతపనైపోయిందే..’అని గుండెలు బాదుకుంటూ రోదించింది. హనుమాన్ నగర్ పోలీసులకు సమాచారం తెలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 


హనుమాన్ నగర్ పోలీస్‌స్టేషన్ ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ భార్యభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవని, గురువారం కూడా మరోసారి గొడవ జరగడంతో ఖుష్రాజ్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామన్నారు.

Updated Date - 2021-11-12T18:19:41+05:30 IST