ఆస్ట్రో టూరిజాన్ని ప్రారంభించబోతున్న రాజస్థాన్.. దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా గుర్తింపు

ABN , First Publish Date - 2022-06-21T02:31:04+05:30 IST

భారత దేశంలోనే మొట్టమొదటగా రాజస్థాన్.. రాష్ట్ర వ్యాప్తంగా ఆస్ట్రో టూరిజాన్ని ప్రారంభించబోతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల్లో.. పర్యాటకులు టెలీస్కోప్ వంటి పరికరాల సహాయంతో రాత్రివేళ ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసేందు

ఆస్ట్రో టూరిజాన్ని ప్రారంభించబోతున్న రాజస్థాన్.. దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా గుర్తింపు

ఇంటర్నెట్ డెస్క్: భారత దేశంలోనే మొట్టమొదటగా రాజస్థాన్.. రాష్ట్ర వ్యాప్తంగా ఆస్ట్రో టూరిజాన్ని ప్రారంభించబోతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల్లో.. పర్యాటకులు టెలీస్కోప్ వంటి పరికరాల సహాయంతో రాత్రివేళ ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర రాజధాని జైపూర్‌కు పలు ప్రాంతాల నుంచి పర్యాటకుల తాకిడీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పర్యాటకులు ఆకాశాన్ని వీక్షించేందుకు జైపూర్‌లో జంతర్ మంతర్, అంబర్ ఫోర్ట్, యూనివర్సిటీ ఆఫ్ మహారాజా, జవహార్ కాలా కేంద్ర ప్రదేశాల్లో టెలీస్కోప్ వంటి పరికరాలను అందుబాటులో ఉంచింది. కరోనా ఆంక్షల వల్ల ఇళ్లకే పరిమితమైన ప్రజలను దృష్టిలో పెట్టుకుని.. 2021లో ‘స్టార్ గేజింగ్’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. ఆ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చినట్లు పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలను మరిన్నింటిని ఏర్పాటు చేయాలనే అభ్యర్థనలు ప్రజల నుంచి కూడా రావడంతో.. ప్రభుత్వం ఆస్ట్రో టూరిజాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. 


Updated Date - 2022-06-21T02:31:04+05:30 IST