బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్‌కు రాజాసింగ్ వార్నింగ్

ABN , First Publish Date - 2022-02-04T01:03:08+05:30 IST

టీఆర్‌ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్‌కు రాజాసింగ్ వార్నింగ్

హైదరాబాద్: టీఆర్‌ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. బోధన్ మున్సిపల్‌లో టిప్పుసుల్తాన్, సలావుద్దీన్ ఒవైసీ విగ్రహాలు ఏర్పాటుకు తీర్మానం చేయడాన్ని రాజాసింగ్ తప్పుబట్టారు. టిప్పుసుల్తాన్‌ విగ్రహం పెడితే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. హైదరాబాదులో ఉన్న ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలే సలావుద్దీన్ ఒవైసీ విగ్రహం పెట్టలేదన్నారు. ఎంఐఎం ఆఫీస్ దారుస్సలాంలో సైతం సలావుద్దీన్ ఒవైసీ విగ్రహం లేదన్నారు. మరి బోధన్‌లో పెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 


ఎంఐఎం లీడర్లను సంతృప్తి పరిచేందుకుకేనా సలావుద్దీన్ ఒవైసీ విగ్రహం పెడతా అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాలు పెట్టాలనుకుంటే తెలంగాణ కోసం పోరాడిన వారివి లేదా అని ఆయన ప్రశ్నించారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వారి విగ్రహాలు పెట్టాలని రాజాసింగ్‌ డిమాండ్ చేశారు. టిప్పుసుల్తాన్ విగ్రహం పెడితే ఊరుకునేది లేదని, ఖచ్చితంగా తీసి వేస్తామని ఆయన హెచ్చరించారు.  50 లక్షల మంది హిందువులను చంపిన వ్యక్తి టిప్పుసుల్తాన్ అని, ఆయనను తాము సైతాన్‌లా చూస్తామన్నారు. అలాంటి సైతాన్ విగ్రహం పెడితే హిందువులు ఒప్పుకోరని రాజాసింగ్ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-02-04T01:03:08+05:30 IST