Rajasingh Suspension: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు

ABN , First Publish Date - 2022-08-23T20:33:17+05:30 IST

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై (Rajasingh) సస్పెన్షన్ వేటు పడింది. బీజేపీ (BJP) హైకమాండ్ రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.

Rajasingh Suspension: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై (Rajasingh) సస్పెన్షన్ వేటు పడింది. బీజేపీ (BJP) హైకమాండ్ రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో..సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను పార్టీ ఆదేశించింది. అంతేగాక బీజేఎల్పీ పోస్ట్ నుంచి రాజాసింగ్‌ను అధిష్టానం తప్పించింది. సోషల్ మీడియాలో రాజాసింగ్ పోస్టు చేసిన ఒక వీడియో వివాదాస్పదమై వైరల్ కావడంతో దుమారం చెలరేగింది. దీంతో ఒక వర్గం సోమవారం రాత్రి నుంచి ఆందోళనకు దిగింది. అనంతరం ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 


అయితే ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్‌ను ముందే ఊహించారు. శనివారం మునావర్ ఫారుఖీ షోను అడ్డుకుని తీరుతామన్న రాజాసింగ్ ధర్మాన్ని కాపాడే క్రమంలో పార్టీ సస్పెండ్ చేసినా బాధపడనని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ చెప్పారు. తన వల్ల పార్టీకి నష్టం జరుగుతోందంటే.. నుపూర్‌ శర్మలా తనను కూడా సస్పెండ్ చేయొచ్చునని అన్నారు. తనను సస్పెండ్ చేసినా ప్రధాని మోదీ, అమిత్‌షాలకు ఫాలోవర్‌గా ఉంటానన్నారు. పార్టీ కంటే.. ధర్మాన్ని కాపాడటమే తనకు ముఖ్యమన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తాయని రాజాసింగ్ ముందే చెప్పారు. 

Updated Date - 2022-08-23T20:33:17+05:30 IST