Abn logo
Jul 19 2021 @ 15:32PM

మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: రాజాసింగ్

హైదరాబాద్: నగరంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపు ఇచ్చారు. ఏ క్షణమైన హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తే అవకాశముందన్నారు. గత అనుభవాల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌లో రోజు వర్షాలు కురుస్తున్నాయని దీంతో  హిమాయత్‌సాగర్, గండిపేటకు భారీగా వరద నీరు  చేరుతుందని, ఏ క్షణమైన  గేట్లు ఎత్తే అవకాశముందని రాజాసింగ్ పేర్కొన్నారు.