Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 20 May 2022 05:06:34 IST

మళ్లీ ప్రేక్షకులే నన్ను నిలబెట్టాలి

twitter-iconwatsapp-iconfb-icon
మళ్లీ ప్రేక్షకులే నన్ను నిలబెట్టాలి

‘‘శేఖర్‌’ సినిమా చాలా బాగా వచ్చిందనే నమ్మకం ఉంది. అయినా ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో అని ఒత్తిడికి గురవుతున్నాను. గతంలో మా వెనుక కొన్ని ఆస్తులున్నాయి. కాని ఇప్పుడు ఈ సినిమా ఫలితం అటూ ఇటు అయితే అప్పులపాలవుతామనేది నా టెన్షన్‌. నాకు మంచి చేయాలనుకునే ప్రేక్షకులు ఈ సినిమాను చూసి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చేయాలి. నన్ను తిరిగి నిలబెట్టాలి’ అని రాజశేఖర్‌ కోరారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాజశేఖర్‌ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. 


ప్రేక్షకులకు నా నుంచి ఒక వైవిధ్యమైన చిత్రం అందించాలని చాలా కష్టపడి ‘శేఖర్‌’ చేశాను. ఈసారి ప్రేక్షకులను నిరాశ పరచను. ‘సినిమా బాగుంది’ అనే టాక్‌ వస్తేనే థియేటర్‌కు వచ్చి ‘శేఖర్‌’ చిత్రాన్ని చూడమని ప్రేక్షకులకు చెబుతున్నాను. 


ఈ సినిమాలో నటుడిగా నేను చాలా సంతృప్తి చెందా. తండ్రిగా, పోలీసాఫీసర్‌గా భిన్న భావోద్వేగాలను చూపించాల్సి రావడం సవాల్‌గా అనిపించింది. సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ గెటప్‌లో కొత్తగా కనిపిస్తాను. ‘శేఖర్‌’లో నా లుక్‌ బాగుందని చాలామంది ప్రశంసించారు. 


సినిమా టేకింగ్‌లో జీవితకు నేను కొన్ని సలహాలిచ్చాను. ఇద్దరం చర్చించుకొని అవసరమైన మార్పులు చేశాం. ఆమె అద్భుతమైన దర్శకురాలు. కథకు న్యాయం చేసింది.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement