Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 04 Aug 2022 12:16:27 IST

Rajasekhar : నెక్స్ట్ మూవీతో అయినా హిట్టొస్తుందా?

twitter-iconwatsapp-iconfb-icon

టాలీవుడ్‌లో పోలీసు పాత్రలకు కేరాఫ్ అడ్రెస్‌ అయిన రాజశేఖర్ (Rajasekhar) వాటితోనే యాంగ్రీ యంగ్‌మేన్ అనిపించుకున్నారు. ‘అంకుశం’ (Ankusham) చిత్రం ఆయన స్టార్‌డమ్‌ను మరింతగా పెంచింది. ఆ తర్వాత మరిన్ని పోలీస్ పాత్రలు పోషించి తన ట్రేడ్ మార్క్ పెర్ఫార్మెన్స్‌తో చెలరేగిన ఆయన.. ఆ తర్వాత తన ఫామ్‌ను కోల్పోయారు. మళ్ళీ మంచి సినిమాతో సక్సెస్ అందుకొని టాలీవుడ్‌లో తిరిగి ఫామ్‌లోకి రావాలని విశ్వప్రయత్నాలు చేశారు. మధ్యలో ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) ‘గరుడవేగ’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఆయన.. ఆ తర్వాత కూడా సక్సెస్‌ను కంటిన్యూ చేస్తారని భావించారు జనం. కానీ  ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి’ (Kalki) అనే పోలీస్ యాక్షన్ చిత్రం అంతగా అలరించలేకపోయింది. 

‘కల్కి’ చిత్రం తర్వాత కరోనా సోకి, కండిషన్ క్రిటికల్‌గా మారడంతో.. కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చారు రాజశేఖర్. కరోనా నుంచి కోలుకున్న తర్వాత విడుదలైన చిత్రం ‘శేఖర్’ (Sekhar). మలయాళ సూపర్ హిట్ ‘జోసెఫ్’ (Joseph) కు ఈ సినిమా అఫీషియల్ రీమేక్. జీవిత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో నటుడిగా రాజశేఖర్‌కు మంచి మార్కులు పడ్డా.. కథాకథనాల్ని సమర్ధవంతంగా నడపడంలో జీవిత విఫలమైంది. తన కెరీర్ ను తిరిగి నిలబెడుతుందని బలంగా నమ్మిన రాజశేఖర్‌ను ఈ సినిమా తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రస్తుతం ఆయన కెరీర్‌లో ఓ సాలిడ్ హిట్ పడాలి. 

యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేని (Pavan Sadhineni) దర్శకత్వంలో రాజశేఖర్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ‘ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి, సేనాపతి’ లాంటి చిత్రాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు పవన్ సాధినేని. పవర్‌ఫుల్ కథాకథనాలతో రాజశేఖర్‌ను డిఫరెంట్ పాత్రలో ప్రెజెంట్ చేయబోతున్నాడట పవన్.  మార్కాపురం శివకుమార్ (Markapuram Shivakumar) నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రాబోతోంది. ఇందులో మాఫియా డాన్‌గా నటించబోతున్నట్టు సమాచారం. మరి ఈ సినిమా అయినా ఆయన కెరీర్ ను తిరిగి గాడిలో పెడుతుందేమో చూడాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement