రాజరాజేశ్వరీ.. కటాక్షించు తల్లీ..!

ABN , First Publish Date - 2022-10-05T05:47:51+05:30 IST

దసరా శరన్ననవరాత్రి ఉత్స వాల్లో తొమ్మిదవ రోజైన మంగళవారం అమ్మవారు పలు ఆలయాల్లో రాజరా జేశ్వరిగానూ, ధనలక్ష్మిగానూ భక్తులకు దర్శనమిచ్చారు.

రాజరాజేశ్వరీ.. కటాక్షించు తల్లీ..!
మదనపల్లె అర్బన్‌: అలంకారణలో అమ్మవారు

మదనపల్లె అర్బన్‌, అక్టోబరు 4:దసరా శరన్ననవరాత్రి ఉత్స వాల్లో  తొమ్మిదవ రోజైన మంగళవారం అమ్మవారు  పలు ఆలయాల్లో  రాజరా జేశ్వరిగానూ, ధనలక్ష్మిగానూ భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని వాసవీభవన్‌ వీధిలో గల వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో ఆర్యవైశ్యసంఘం ఆధ్వర్యంలో ఆలయ రాజరాజేశ్వరిగా అమ్మవారిని అలంక రించి పూజలు చేశారు. కార్యక్రమంలో మదనపల్లె ఆర్య వైశ్యసంఘం అధ్యక్షుడు పూనగంటి ఓంప్రకాష్‌, ట్రెజరర్‌ సూరేగిరిధర్‌, సెక్రటరీ దేవత సతీష్‌, మహిళసంఘాల సభ్యులు పాల్గొన్నారు.  నీరుగుట్టువారిపల్లెలో చౌడేశ్వరిదేవి ఆలయంలో చౌడేశ్వరీదేవిని ఆలయకమిటీ ఆధ్వర్యంలో ధనలక్ష్మీగా అలంకరణ చేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహిం చి భక్తులకు దర్శనం కల్పించారు. పట్టణంలోని కోర్టు ఆవర ణలో ఉన్న గంగమ్మ తల్లిని  ఆలయక మిటీ సభ్యులు మా ర్పురి సుధాకర్‌నాయుడు, మార్పురి నాగార్జున బాబు (గాంధీ) నీరుగట్టి ఆనందరెడ్డి, చైతన్యకుమార్‌రెడ్డి, ఆధ్వ ర్యంలో  వివిద పుష్పాలతో పుష్పాలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. సీటీఎం రోడ్డు దేవతానగర్‌లోని రాజరాజేశ్వరీదేవి ఆలయంలో ఽధర్మకర్త పతాంజలీ స్వామి ఆధ్వర్యంలో అమ్మవారిని మహి షాసురమర్తినిగా ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. చిప్పిలిగ్రామం లోని అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారిని వివిధ రూపాల్లో అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. బుగ్గకాలువలో బాటగంగమ్మను నిర్వహకురాలు బోగ్గిటి  అలివేలమ్మ దుర్గామాత అలంకరణ చేసి   భక్తులకు దర్శనం కల్పించి, అన్నదానం చేశారు. 

ములకలచెరువులో: స్థానిక పీటీఎం రోడ్డులో వెలసిన వాసవీ కన్యకా పరమేశ్వరిదేవి అమ్మవారు మంగళవారం నవధాన్యాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. 

Updated Date - 2022-10-05T05:47:51+05:30 IST