దక్షిణకాశిగా విరాజిల్లుతున్న రాజన్న ఆలయం

ABN , First Publish Date - 2022-07-01T06:44:04+05:30 IST

వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయం దక్షిణకాశిగా విరాజిల్లుతోందని కేంద్ర విద్యుత్‌, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కృషన్‌పాల్‌ గుజ్జర్‌ అన్నారు. బీజేపీ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా వేములవాడకు వచ్చిన ఆయన ముందుగా రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

దక్షిణకాశిగా విరాజిల్లుతున్న రాజన్న ఆలయం
సమావేశంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి కృషన్‌పాల్‌ గుజ్జర్‌

 - కేంద్ర విద్యుత్‌, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కృషన్‌పాల్‌ గుజ్జర్‌

వేములవాడ టౌన్‌, జూన్‌ 30 :  వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయం   దక్షిణకాశిగా విరాజిల్లుతోందని కేంద్ర విద్యుత్‌, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కృషన్‌పాల్‌ గుజ్జర్‌ అన్నారు. బీజేపీ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా వేములవాడకు వచ్చిన ఆయన ముందుగా  రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్థానిక భీమేశ్వర గార్డెన్‌లో విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఉత్తరకాశికి ఎంత విశిష్టిత ఉన్నదో దక్షిణకాశి వేములవాడ ఆలయానికి కూడా అంతే విశిష్టత ఉందని అన్నారు. పార్టీలోని అన్ని విభాగాలతో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో  48 గంటలపాటు బీజేపీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.    రాష్ట్రంలో  బీజేపీ విస్తరణ, అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని, రాష్ట్రంలో  పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు సుదీర్ఘ ఆలోచనలు చేస్తామని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగ విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతామన్నారు.   భారతీయ జనత పార్టీలో సామాన్య కార్యకర్తలకు సైతం గొప్ప పదవులు వస్తాయని చెప్పడానికి రాష్ట్రపతి అభ్యర్థి ఒక ఉదాహరణ అన్నారు.  దేశ వ్యాప్తంగా 18 వేల గ్రామాలకు విద్యుత్‌, మౌలిక సవతుల కల్పన చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని ఒక్క సంవత్సరంలోనే హామీని నెరవేర్చిన ఘనత ప్రధానికి మోదీకి  దక్కుతుందని అన్నారు.  అంతకుమందు కేంద్రమంత్రి కృషన్‌ పాల్‌ గుజ్జర్‌కు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో నందికమాన్‌ వద్ద ఘనస్వాగతం పలికారు. అనంతరం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో  పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మంత్రిని గజమాలతో సన్మానించారు.  సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, మాజీ జడ్పీచైర్‌పర్సన్‌ తుల ఉమ, ఎర్రం మహేష్‌, రేగుల మల్లికార్జున్‌, గోపు బాలరాజు, కోల కృష్ణస్వామి, ఎంపీపీ బండ మల్లేశం యాదవ్‌, 

రాజన్న సేవలో..

వేములవాడ రాజరాజేశ్వరస్వామిని కేంద్ర మంత్రి కృషన్‌పాల్‌ గుజ్జర్‌ దర్శించుకున్నారు.  అనంతరం ఆలయ కల్యాణమండపంలో  అర్చకులు ఆయనను ఆశీర్వదించారు. ఆలయ ఈవో రమాదేవి  స్వామి వారి లడూ ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. అంతకుముందు  ఆలయ సంప్రదాయం ప్రకారం ఆహ్వానించారు.   జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, ఆర్డీవో లీల, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేష్‌ ఉన్నారు. 

Updated Date - 2022-07-01T06:44:04+05:30 IST