Abn logo
Sep 23 2021 @ 00:43AM

రాజన్న హుండీ ఆదాయం రూ.కోటి 44 లక్షలు

చిల్లర నాణేలు లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది

వేములవాడ, సెప్టెంబరు 22 : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి ఖజానాకు హుండీ ద్వారా రూ.కోటి 44 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. భక్తులు  స్వామివారి హుండీల్లో సమర్పించిన నగదు, బంగారు, వెండి కానుకలను ఆలయ ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంగణంలో బుధవారం లెక్కించారు. ఈ సందర్భంగా కోటి 44 లక్షల 25 వేల 116 రూపాయల నగదు, 413.500 గ్రాముల బంగారం, 10 కిలోల 700 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ తెలిపారు.  ఎనిమిది రోజుల వ్యవధిలో భక్తులు హుండీలలో వేసిన కానుకలతోపాటు అంతకుముందు 19 రోజుల వ్యవధిలోని 29 హుండీల్లో కొన్నింటిని బుధవారం లెక్కించారు.  మరో 11 హుండీలు ఇంకా లెక్కించాల్సి ఉంది.