హుండీ ఆదాయం లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది
వేములవాడ, జనవరి 19 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఖజానాకు హుండీ ద్వారా కోటి రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. ఇరవై రోజుల వ్యవధిలో భక్తులు స్వామివారి హుండీల్లో సమర్పించిన నగదు, బంగారు, వెండి కానుకలను ఆలయ ఓపెన్ స్లాబ్ ప్రాంగణంలో బుధవారం లెక్కించారు. ఈ సందర్భంగా కోటి 50 వేల 764 రూపాయల నగదు, 85 గ్రాముల 840 మిల్లీల బంగారం, 5 కిలోల 450 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ఈవో ఎల్.రమాదేవి, ఏఈవో ప్రతాప నవీన్, ఆలయ అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.