May 13 2021 @ 13:02PM

మంచు ఫ్యామిలీతో రజనీకాంత్

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబుతో సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ఉన్న ప్రత్యేకమైన అనుబంధం గురించి అందరికీ తెలిసిదే. రజనీకాంత్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా తప్పకుండా మోహన్ బాబు ఫ్యామిలీని కలుస్తుంటారు. ఇరు కుటుంబాల మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తే షూటింగ్ గత కొన్ని రోజుల నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో సాగుతుండగా ఇటీవల షూటింగ్ పూర్తయింది. దాంతో తన స్నేహితుడుని కలిసేందుకు రజనీ మోహన్ బాబు ఇంటికి వెళ్ళారు. ఆయన కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా రజినీతో దిగిన ఫోటోలను మంచులక్ష్మీ తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫ్టోలు వైరల్‌ అవుతున్నాయి. ఇక మోహన్ బాబు అన్నాతే సినిమా గురించి రజనీతో ముచ్చటించినట్టు తెలుస్తోంది. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార, మీనా, ఖుష్బూ, కీర్తి సురేశ్, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్,  కీలక పాత్రలను పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చక్కబడితే ఈ ఏడాదిలోనే అనాత్తే తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది.