రాజంపేటను కైవసం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-07-01T05:30:00+05:30 IST

రాజంపే ట పార్లమెంటు స్థానంతో పాటు అందులోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ కైవ సం చేసుకోవాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. మం గళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్ర వారం మదనపల్లె, పుంగనూరు, పీలేరు, తం బళ్లపల్లె, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూ రు టీడీపీ ఇన్‌చార్జిలు, సమన్వయకర్తలతో సమీక్ష నిర్వహించారు.

రాజంపేటను కైవసం చేసుకోవాలి
మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్న గంటా నరహరి

మినీ మహానాడుపై చంద్రబాబు సమీక్ష

మదనపల్లె టౌన్‌/కలికిరి, జూలై 1: రాజంపే ట పార్లమెంటు స్థానంతో పాటు అందులోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ కైవ సం చేసుకోవాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. మం గళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్ర వారం మదనపల్లె, పుంగనూరు, పీలేరు, తం బళ్లపల్లె, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూ రు టీడీపీ ఇన్‌చార్జిలు, సమన్వయకర్తలతో సమీక్ష నిర్వహించారు. విశ్వసనీయ సమాచా రం మేరకు.. ఏడు నియోజకవర్గాల్లో ఇన్‌చార్జి లు, సమన్వయకర్తల పనితీరుకు సంబంధిం చి క్షేత్రస్థాయిలో నివేదికలను తెప్పించుకున్నా రని, ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా టీడీపీని మరింత బలోపేతానికి కృషి చేయాలని చం ద్రబాబు సూచించారని తెలిసింది. పార్టీ బలో పేతానికి అర్హత ఉన్న వారు ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామన్నారని సమాచారం. మదనప ల్లెలో ఈనెల 6న నిర్వహించనున్న మినీ మహానాడు విజయవంతానికి చేపట్టాల్సిన అంశాలపై చంద్రబాబు సమీక్షించారు.

గంటా నరహరి టీడీపీలో చేరిక

రాజంపేట ఎంపీ టికెట్టు నరహరికే?

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, రా ష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుల సమక్షంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత డి.ఆదికేశవులు నాయుడు సమీప బంధువు గంటా నరహరి టీడీపీలో చేరారు. ఈ మేరకు శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం లో జరిగిన ఒక కార్యక్రమంలో గంటా నరహ రికి కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, రాజం పేట పార్లమెంటు అధ్యక్షుడు ఆర్‌. శ్రీనివాసరెడ్డి నరహరిని పార్టీలో చేర్చడానికి కీలకపాత్ర పోషించా రు. రాబోయే ఎన్నికల్లో సామాజిక సమీ కరణాలన్నీ కలిసొస్తే రాజం పేట ఎంపీ టికెట్టు గంటా నరహ రికే దక్కుతుందని పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. రాజం పేట ఎంపీ సీటుకు కాపు (బలి జ) సామాజిక వర్గానికి కేటాయించడం టీడీ పీ ఆనవాయితీగా కొనసాగిస్తోంది. 2019 ఎన్నికల్లో కూడా ఆదికేశవులు సతీమణి డీకే సత్యప్రభ రాజంపేట నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సత్య ప్రభ సోదరికి అల్లుడయిన గంటా నరహరి ప్రస్తుతం టీడీ పీలో చేరడంతో ఈ చర్చలకు బలం చేకూరు తోంది. కార్యక్రమానికి రాజంపేట పార్లమెం టు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల ఇన్‌చార్జిలు కిశోర్‌కుమార్‌రెడ్డి, శంకర్‌, ప్రసాద్‌, రమేశ్‌కు మార్‌రెడ్డి, దొమ్మలపాటి రమేశ్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T05:30:00+05:30 IST