కడప: జిల్లాలో అన్నమయ్య జిల్లాగా రాయచోటిని ప్రకటించడంతో రాజంపేట ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. రాజంపేట కొత్త జిల్లా వివాదంపై ఎమ్మెల్యే మేడా స్పందించారు. అన్నమ్మయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట కావాలని కోరుతూ కలెక్టర్‌కి ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. గతంలో రాజంపేటను జిల్లాగా చేస్తామని జగన్ హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాగా రాయచోటిని చేయడం బాధాకరమన్నారు. సీఎం దృష్టికి కొత్త జిల్లా సమస్యను తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి