Abn logo
Apr 3 2020 @ 22:07PM

నా సినిమా రిలీజ్ టైమ్‌లో నేను నటిస్తా: రాజమౌళి

అపజయం ఎరుగని దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా రిలీజ్ టైమ్‌లో నటించడమేంటి? అనే అనుమానం వస్తుంది కదా? ఈ విషయం స్వయంగా రాజమౌళినే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సినిమా షూటింగ్ టైమ్‌లో నటీనటులకు అన్నీ తానే నటించి చూపిస్తాడనే పేరు రాజమౌళికి ఉంది. అయితే అది కాదు నాలో ఉన్న అసలు నటన. సినిమా రిలీజ్ టైమ్‌లో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే టెన్షన్‌ని కనిపించకుండా నవ్వుతూ ఉండేటప్పుడు తనలో ఉన్న అసలు నటన బయటపడుతుందని అంటున్నాడు రాజమౌళి. 


తన సినిమా ఏది విడుదల అయినా.. మొదటి షో పడి టాక్ బయటికి వచ్చే వరకు ఎంతో టెన్షన్‌తో ఉంటాడట. కానీ ఆ టెన్షన్‌ని ఎవరికీ కనిపించకుండా ముఖం మీద చిరునవ్వుతోనే అందరినీ పలకరిస్తాడట. ఆ టైమ్‌లో తనని పలకరించే వాళ్లు కూడా తనని చూసి ఎంతో ఆశ్చర్యపోతారట. సినిమా విడుదల అవుతుంది.. అసలు ఏ మాత్రం టెన్షన్ పడటం లేదేంటి అని కొందరు ముఖంమీదే అడిగేవారంట. కానీ లోపల టెన్షన్ ఉన్నా.. బయటికి మాత్రం నవ్వుతూ కనిపిస్తానని, అప్పుడు చూడాలి నాలో ఉన్న నటుడిని అంటూ.. రాజమౌళి ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Advertisement
Advertisement
Advertisement