Abn logo
Mar 28 2020 @ 17:45PM

‘ఆర్ఆర్ఆర్‌’లో విజయ్?

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్‌)’.  రీసెంట్‌గా విడుద‌లైన ఈ చిత్ర మోష‌న్ పోస్ట‌ర్ అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌ల‌తో పాటు అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌, ఒలివియా మోరిస్‌, అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్, స‌ముద్ర ఖ‌ని ఇలా భారీ తారాగ‌ణం న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో స్టార్ హీరో పేరు వినిపిస్తోంది. తమిళ స్టార్ విజయ్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. హీరో విజయ్‌కు రాజమౌళి ఫోసి చేసి తన పాత్రకు సంబంధించిన కథను కూడా చెప్పినట్లు తెలుస్తోంది. విజయ్‌ కూడా ఒప్పుకున్నాడని సమాచారం. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ నిలిచిపోయింది. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత ఈ చిత్ర షూటింగ్‌ను పరుగులు పెట్టించాలని జక్కన్న భావిస్తున్నాడట. అప్పుడు ఈ చిత్రం షూటింగ్‌లో విజయ్ పాల్గొంటాడని టాలీవుడ్ సర్కిల్‌లో టాక్ వినిపిస్తోంది. మ‌రి ఈ వార్త‌లపై జ‌క్క‌న్న అండ్ టీమ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Advertisement
Advertisement
Advertisement