రాజమౌళి శిష్యుడు సాయికృష్ణ కేవీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కథ మొదలైంది’. సంజయ్ వర్మ, లహరి, సంజనా చౌదరి, దర్శిని హీరో హీరోయిన్లు. తమటం కుమార్రెడ్డి, సన్నిధి ప్రసాద్, టి. రమేశ్ నిర్మాతలు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైందీ సినిమా. ‘‘చాలారోజుల తర్వాత మంచి కథ విన్నాను’’ అని ప్రధాన పాత్రలో నటించనున్న సీనియర్ నటుడు సురేశ్ అన్నారు. ‘‘సమాజంలో మనచుట్టూ జరిగే సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది చేస్తున్న చిత్రమిది. కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్’’ అని సాయికృష్ణ కేవీ చెప్పారు. ‘‘సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తి చేస్తాం’’అని తమటం కుమార్రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి కథ: జయకుమార్, మాటలు: విజయ్ నాగభైరు, పాటలు: రామాంజనేయులు, సంగీతం: సన్నీ మాణిక్.