అమరావతి: ఏపీలో పలుప్రాంతాల్లో వైసీపీ నేతలు బ్లాక్ టికెట్ల దందా చేస్తున్నారు. బ్లాక్లో అధిక ధరలకు ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్లు విక్రయిస్తున్నారు. పోలీసులు, అధికారుల అండతోనే వైసీపీ శ్రేణుల బ్లాక్ టికెట్ల దందా సాగుతోంది. రాజమండ్రిలో అయితే వైసీపీ నేతల డిమాండ్ మేరకు.. థియేటర్ల యాజమాన్యాలు సినిమా టికెట్లు అందజేస్తున్నారు. దీంతో రాజమండ్రిలో థియేటర్ల దగ్గర బుకింగ్ కౌంటర్లు తెరుచుకోలేదు. బ్లాక్లో టికెట్లు అధిక రేట్లకు విక్రయించడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. ఆర్ఆర్ఆర్ టికెట్ల కోసం వైసీపీ నేతల ఇళ్లకు అభిమానులు క్యూ కట్టారు. వైసీపీ శ్రేణులు బ్లాక్లో టికెట్లు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఈ బ్లాక్ టిక్కెట్ల తీరుపై ప్రేక్షకులు మండిపడుతున్నారు.