పంచాయతీ ఎన్నికల తీర్పే మున్సిపల్ ఎన్నికల్లో పునరావృత్తం: ఎంపీ భరత్

ABN , First Publish Date - 2021-02-27T14:20:31+05:30 IST

సంక్షేమానికే ప్రజలు పట్టం కడుతున్నారని...పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పే మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో పునరావృత్తం అవుతుందని రాజమండ్రి ఎంపీ భరత్ స్పష్టం చేశారు.

పంచాయతీ ఎన్నికల తీర్పే మున్సిపల్ ఎన్నికల్లో పునరావృత్తం: ఎంపీ భరత్

తిరుమల: సంక్షేమానికే ప్రజలు పట్టం కడుతున్నారని...పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పే మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో పునరావృత్తం అవుతుందని రాజమండ్రి ఎంపీ భరత్ స్పష్టం చేశారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని ఎంపీ దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి పూర్తి మెజారీటి ఉన్నా ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై జగన్ ఒత్తడి తెస్తున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా నినాదం ఇంకా బతికి ఉందంటే అది జగన్ వల్లే అని చెప్పుకొచ్చారు. హోదాపై బాబు ఎన్నో యూటర్న్‌లు తీసుకున్నారని ఎంపీ యెద్దేవా చేశారు. ఢీల్లీలో బాబును యూటర్న్ బాబు అన్ని పిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించేందుకు కూడా కేంద్రంపై ఒత్తిడి తేస్తామని తెలిపారు. మరోవైపు టీటీడి పాలకమండలి గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలంటూ తీర్మానం చేస్తోందని... టీటీడీ తీర్మానం మేరకు వైసీపీ తరుపున గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని లోకసభలో కేంద్రాన్ని డిమాండ్ చేయనున్నట్లు ఎంపీ భరత్ తెలిపారు. 


Updated Date - 2021-02-27T14:20:31+05:30 IST