AP News: రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి 66 మంది విడుదల

ABN , First Publish Date - 2022-08-16T01:31:20+05:30 IST

5వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన 66 మంది ఖైదీలను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి

AP News: రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి 66 మంది విడుదల

రాజమహేంద్రవరం: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన 66 మంది ఖైదీలను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా వారి వారి కుటుంబాలను జైలు బయట కలుసుకున్న వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఆనందంతో వీరిని కుటుంబ సభ్యులు ఆలింగనం చేసుకున్నారు. తొలుత జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌ రాజారావు మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 121 ప్రకారం 48 మంది ఖైదీలు, 122 జీవో ప్రకారం ఏడుగురు ఖైదీలు కలిపి మొత్తం 55 మంది ఖైదీలు జైలు నుంచి విడుదలయ్యారని చెప్పారు. వీరంతా హత్య కేసుల్లో యావజ్జీవ శిక్ష పడి జైలులో శిక్ష అనుభవించిన వారేనని చెప్పారు. కొంతమంది ఏడేళ్లు, మరికొంతమంది పదేళ్లు శిక్షాకాలం అనుభవించిన వారు ఉన్నారని చెప్పారు. ఖైదీలందరూ జైలులో సంస్కరింపబడ్డారని, వారంతా వారి కాళ్లపై వారు నిలబడే విధంగా జైలులో ఉన్న పరిశ్రమలు, వివిధ పనుల్లో పూర్తిగా శిక్షణ పొందారని చెప్పారు. అలాగే నిరక్షరాస్యులుగా వచ్చిన ఖైదీలకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ ద్వారా డిగ్రీలు చదివించామని, అది ఉద్యోగాలు రావడానికి ఉపయోపడతుందని చెప్పారు. అలాగే మహిళా జైలు నుంచి 11 మంది ఖైదీలు విడుదలయ్యారు. వీరంతా బయట వారి కోసం వచ్చిన కుటుంబ సభ్యులను ఆప్యాయంగా కలవడం కనిపించింది.  

Updated Date - 2022-08-16T01:31:20+05:30 IST