సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అశ్లీల నృత్యాలు

ABN , First Publish Date - 2021-02-27T16:18:12+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామ సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అశ్లీల నృత్యాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అశ్లీల నృత్యాలు

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామ సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అశ్లీల నృత్యాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాణస్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన సంబరాలు శృతిమించి  నూతన సర్పంచ్, వార్డు సభ్యులు అమ్మాయిలతో అసాంఘిక డ్యాన్స్‌లను చేయించారు. సర్పంచ్ ప్రమాణ స్వీకారం  సందర్బంగా అశ్లీల డ్యాన్స్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గ్రామాన్ని మోడల్  విలేజ్‌గా  మారుస్తామని  ఉపన్యాసాలు చేసిన వేదికపైనే అశ్లీల డ్యాన్స్‌లు వేయించడంపై స్థానికులు మండిపడుతున్నారు. 

Updated Date - 2021-02-27T16:18:12+05:30 IST