కాంట్రాక్టుల కోసం పార్టీ మారే దొంగ రాజగోపాల్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-08-14T05:41:32+05:30 IST

కాంట్రాక్టుల కోసం పార్టీ మారే దొంగ రాజగోపాల్‌రెడ్డి అని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి ఆరోపించారు. మునుగోడులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

కాంట్రాక్టుల కోసం పార్టీ మారే దొంగ రాజగోపాల్‌రెడ్డి
మునుగోడులో పార్టీలో చేరిన దుబ్బకాల్వ సర్పంచ్‌ మణెమ్మకు కండువా కప్పుతున్న మంత్రి జగదీ్‌షరెడ్డి

విద్యుత్‌ శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి

మునుగోడు, ఆగస్టు 13: కాంట్రాక్టుల కోసం పార్టీ మారే దొంగ రాజగోపాల్‌రెడ్డి అని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి ఆరోపించారు. మునుగోడులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంతో రూ.21వేల కోట్ల కాంట్రాక్టు పనుల ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతే కాంగ్రె్‌సను వీడి బీజేపీలో చేరుతున్న వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అని విమర్శించారు. గతంలో కూడా కాంట్రాక్ట్‌ పనులు అప్పగిస్తే టీఆర్‌ఎ్‌సలోకి వస్తానని సీఎం కేసీఆర్‌ చుట్టూ తిరిగి కాళ్ల బేరమాడారని చెప్పారు. కాంట్రాక్టుల కోసం నడిబజారులో అమ్ముడుపోయి అభివృద్ధి కోసమని నీతి వ్యాఖ్యలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి స్వార్థ రాజకీయాలు చేసే రాజగోపాల్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. ప్రజలను వంచిస్తూ నాటకాలు ఆడుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఆటలు ఇక సాగనీయబోమని హెచ్చరించారు. బీజేపీ ఎనిమిదేళ్ల పాలనలో నిత్యావసర సరుకులు, పెట్రో ఉత్పత్తుల ధరలు పెం చి ప్రజలపై భారం మోపారని చెప్పారు. మునుగోడులో జరిగే ఉపఎన్నికలో దొంగలు, పైరవీకారులు, గుత్తేదారులకు ఈప్రాంత ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. ఈ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డిని చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీ వైఫల్యాలు, తెలంగాణలో జరిగే అభివృద్ధిని అడ్డుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించేందుకు మునుగోడులో ఈనెల 20న నిర్వహించే ప్రజాదీవెన సభ కు సీఎం కేసీఆర్‌ వస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు  ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ప్రజాదీవెన సభా స్థలాన్ని పరిశీలించారు. మంత్రి వెంట తుంగతుర్తి, నకిరేకల్‌ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌, చిరుమ ర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యలమంచిలి వెంటేశ్వర్లు, నారబోయిన రవిముదిరాజ్‌, బోళ్ల శివశంకర్‌నేత, ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్‌, పార్టీ మండల అధ్యక్షుడు బండా పురుషోత్తంరెడ్డి, జాజుల అంజయ్యగౌడ్‌, ఏరుకొండ శీనివాసు పాల్గొన్నారు.


టీఆర్‌ఎ్‌సలో పలువురి చేరిక

మంత్రి జగదీ్‌షరెడ్డి సమక్షంలో మునుగోడులో శనివారం పలువురు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మండల పరిధిలోని దుబ్బకాల్వ సర్పంచ్‌ సాధు మణెమ్మ, రావిగూడెం గ్రామ వార్డు సభ్యుడు నర్సింహతోపాటు వారి అనుచరులు, లక్ష్మీదేవిగూడెం ఇతర గ్రామాల నుంచి పెద్దఎత్తున పార్టీలో చేరారని ఆపార్టీ నేతలు తెలిపారు.  


టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలి : లింగయ్య యాదవ్‌

చౌటుప్పల్‌: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాద వ్‌, ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్‌రావులు కోరారు. చౌటుప్పల్‌ మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజా సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. సమావేశంలో  మునిసిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, మునిసిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ బొడ్డు శ్రీనివా్‌సరెడ్డి, కౌన్సిలర్‌లు కొరగోని లింగస్వామి, బాబాషరీఫ్‌, సుల్తాన్‌ రాజు, శీరిషపరమేష్‌, అరుణ బాలకృష్ణ, ఖలీల్‌బాయి, గుండెబోయిన వెంకటేష్‌, కానుగుల వెంకటయ్య, సుర్కంటి రాంరెడ్డి, బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, తొర్పునూరి నర్సింహ, ఊడుగు రమేష్‌, శ్రీనివాస్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

చౌటుప్పల్‌ రూరల్‌: అధిష్ఠాన నిర్ణయానికి నాయకులు కట్టుబడి పనిచేయాలని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్‌, శానంపూడి సైదిరెడ్డి సూచించారు. చౌటుప్పల్‌ మండల కేంద్రంలో పట్టణ, మండల కార్యకర్తల వేర్వురు సమావేశాల్లో  పాల్గొని మాట్లాడారు. ఉపఎన్నికలో కార్యకర్తలు  సైనికుల్లా పనిచేయాలన్నారు. కాగా ఎంపీపీ, మండలంలోని అనేక మంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సింగిల్‌విండో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ సమావేశానికి గైర్హాజరు కావడం చర్చనీయంగా మారింది. వీరు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టిక్కెటు ఇవ్వవద్దని నిరసన గళం విప్పితున్నారు. ఈ నేపథ్యంలోనే సమావేశానికి రాన్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-08-14T05:41:32+05:30 IST