Komati Reddy Counter: రేవంత్‌రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కౌంటర్‌

ABN , First Publish Date - 2022-08-03T19:46:27+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు.

Komati Reddy Counter: రేవంత్‌రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కౌంటర్‌

హైదరాబాద్ (Hyderabad): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy)కి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) కౌంటర్‌ (Counter) ఇచ్చారు. నాలుగు పార్టీలు మారిన వ్యక్తి తనపై నిందలు వేస్తున్నారని అన్నారు. రేవంత్‌రెడ్డికి అసలు వ్యక్తిత్వం ఉందా? అని ప్రశ్నించారు. రేవంత్‌ వ్యాపారం చేయకుండానే ఇన్నికోట్లు ఎలా వచ్చాయని నిలదీశారు. వ్యాపారులను రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తారని, రాజకీయ నేత ముసుగులో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. రేవంత్‌ ఓ ప్లాన్‌ ప్రకారమే తెలంగాణ టీడీపీని ఖతం చేశారని విమర్శించారు. టీపీసీసీ చీఫ్‌ అయ్యి రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారని, ఈ పదవిని రేవంత్‌ డబ్బులిచ్చి తెచ్చుకున్నారని ఆరోపించారు. సీఎం కావడమే రేవంత్‌రెడ్డి లక్ష్యమని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.


రేవంత్‌రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్ అని, అలాంటి వ్యక్తులతో తాను నీతులు చెప్పించుకోవాలా? అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. రేవంత్ నేతృత్వంలో టి.కాంగ్రెస్‌ బతకదని, ఆయన కింద పనిచేసేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. కాంట్రాక్టుల కోసమే తాను అమ్ముడు పోయానని మాట్లాడుతున్నారని, కాంట్రాక్టులకు అమ్ముడుపోయినట్లు నిరూపిస్తారా?... నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, నిరూపించలేకపోతే రేవంత్‌ రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని సవాల్ చేశారు. కాంగ్రెస్ రేవంత్‌రెడ్డి జాగీరా?.. రేవంత్‌ ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

Updated Date - 2022-08-03T19:46:27+05:30 IST