రాష్ట్రంలో అరాచక పాలన

ABN , First Publish Date - 2022-01-19T05:36:34+05:30 IST

ప్రజలు ఎన్నుకున్న పాలకులు ఆరోగ్యకరంగా పాలించాలని.. అరాచకంగా కాదని రాజధాని అమరావతికి 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం మంగళవారం 763వ

రాష్ట్రంలో అరాచక పాలన
తుళ్లూరు శిబిరంలో జై అమరావతి అంటూ నినాదాలు చేస్తునన మహిళలు

అమరావతిని నాశనం చేయడమే వారి లక్ష్యం

ఎన్ని కుట్రలు చేసినా రాజధాని అమరావతే

763వ రోజుకు చేరుకున్న ఆందోళనలు 


తుళ్లూరు, జనవరి18: ప్రజలు ఎన్నుకున్న పాలకులు ఆరోగ్యకరంగా పాలించాలని.. అరాచకంగా కాదని రాజధాని అమరావతికి 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం మంగళవారం 763వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ధర్నా శిబిరాలలో రైతులు మాట్లాడుతూ సీఎం జగన్‌ అమరావతిని నాశనం చేయటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. అందుకే రూ.పదివేల కోట్లతో చేసిన అభివృద్ధి పనులను గాలికి వదిలేశారని అన్నారు. రోడ్లు పాడవుతున్నాయి.. పెద్ద పెద్ద భవనాలు నిరుపయోగంగా మారాయన్నారు. రాష్ట్ర పాలన ఐదేళ్లుగా అమరావతి నుంచే జరుగుతుంటే మధ్యలో మూడు రాజధానులంటూ కుట్రపూరితంగా తెరపైకి తెచ్చారన్నారు. న్యాయదేవత, ఐదు కోట్ల మంది ప్రజలు అమరావతి రైతులకు అండగా ఉన్నారన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా దీపాలు వెలిగించి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.

Updated Date - 2022-01-19T05:36:34+05:30 IST