Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమరావతి కోసం అలుపెరగని ఉద్యమం

717వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు


తుళ్లూరు, డిసెంబరు4: అమరావతి రాజధాని సాధన కోసం అలుపెరగని ఉద్యమం చేస్తామని రాజధాని రైతులు, మహిళలు పేర్కొన్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం శనివారం 717వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు దీక్షా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ, మూడు రాజధానులు కావాలని  ఎవరూ అడగలేదన్నారు. సొంత ప్రయోజనాల కోసం అమరావతిని మూడు ముక్కలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయ వనరు అమరావతి రాజధాని కోసం ఉద్యమం తప్పటం లేదన్నారు.అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా దీపాలు వెలిగించి జై అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ నినాదాలు చేశారు. రాజధాని 29 గ్రామాలలో ఆందోళనలు కొనసాగాయి. 


Advertisement
Advertisement