Advertisement
Advertisement
Abn logo
Advertisement

అసత్య ప్రచారాలపై చర్యలు తీసుకోరు

679వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు


తుళ్లూరు, అక్టోబరు 26: రాజధాని అమరావతిపై అసత్య ప్రచారాలు చేసిన, ఉద్యమం చేస్తున్న వారి గురించి అసభ్యకరంగా మాట్లాడిన వారిపైన ఫిర్యాదులు చేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదని రాజధాని రైతులు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు, మహిళలు చేస్తోన్న ఉద్యమం మంగళవారంతో 679వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి ముంపు ప్రాంతం, నిర్మాణాలకు అనుకూలంగా ఉండదంటూ అసత్య ప్రచారాలు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలు లేవని, మహిళలపై అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టారని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందన్నారు. రాజధానికి భూములు ఇచ్చి కూడా పాలకుల వల్ల పడుతున్న బాధలను ప్రపంచానికి చెప్పుకుందామంటే గొంతు నొక్కి, అక్రమ కేసులు బనాయిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో రాష్ట్ర ప్రజలు అయోమయంలో పడిపోయారన్నారు. నవంబరు ఒకటి నుంచి అమరావతి ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయాలని న్యాయస్థానం టూ దేవస్థానం వరకు చేపట్టే మహా పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రాజధాని గ్రామాల్లో అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. 

 

Advertisement
Advertisement