అమరావతిపై.. కపట ప్రేమ

ABN , First Publish Date - 2021-02-27T05:27:46+05:30 IST

రాజధాని అమరావతిపై సీఎం జగన్‌ కపట ప్రేమ చూపిస్తున్నారని రాజధాని రైతులు తెలిపారు.

అమరావతిపై.. కపట ప్రేమ
పెదపరిమి శిబిరంలో దీక్ష చేస్తున్న మహిళా రైతులకు సంఘీభావం తెలుపుతున్న సినీ హీరో శివాజీ

437వ రోజు ఆందోళనల్లో రైతుల ధ్వజం

  రైతులకు సినీ హీరో శివాజీ సంఘీభావం


తుళ్లూరు, తాడేపల్లి, తాడికొండ, ఫిబ్రవరి 26: రాజధాని అమరావతిపై సీఎం జగన్‌ కపట ప్రేమ చూపిస్తున్నారని రాజధాని రైతులు తెలిపారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొసాగాలని వారు చేస్తోన్న ఉద్యమం శుక్రవారంతో 437వ రోజుకు చేరుకుంది. కృష్ణాపాలెం, మందడం, తుళ్లూరు, పెదపరిమి రైతు దీక్షా శిబిరాలను సందర్శించిన సినీహీరో శివాజీ వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ అమరావతిని అంగుళం కూడా కదిలించలేరన్నారు. అమరావతి అభివృద్ధి చేస్తామంటే కాదనడం లేదని, అయితే ఒకే రాజధానిగా అభివృద్ధి చేయాలన్నారు. రైతు శిబిరాల నుంచి మహిళలు,  దళిత జేఏసీ నేతలు మాట్లాడుతూ ఎన్నికల స్టంట్‌ కోసం అమరావతికి సీఎం జగన్‌ మూడు వేల కోట్లు బ్యాంకు గ్యారంటీతో మంజూరు చేస్తున్నట్లు ప్రకటిం చారన్నారు. కేంద్రం మెడలు వంచుతామన్న సీఎం జగన్‌ ప్రత్యేక హోదా ఊసు లేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. కృష్ణా జిల్లా జడ్పీ మాజీ చైర్‌ పర్సన్‌ గద్దె అనురాధ రైతు శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలి పారు. జగన్‌ మోహన్‌రెడ్డి మూడు ముక్కల ఆట మూనుకోవాలని ఆమె డిమాండు చేశారు. తుళ్లూరు, వెలగపూడి, మందడం, రాయపూడి, పెదపరిమి, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, నెక్కల్లు, అనంతవరం, ఐనవోలు, నేలపాడు, తాడేపల్లి మండలం పెనుమాక తదితర రా జధాని గ్రామాల్లో దీక్షలు కొనసాగాయి. అదేవిధంగా తాడికొండ మండ లం మోత డకలో రైతులు, మహిళలు శుక్రవారం నిరసనలు తెలిపారు.


 

Updated Date - 2021-02-27T05:27:46+05:30 IST