ప్రత్యేక హోదాను మరిచారు

ABN , First Publish Date - 2021-01-19T05:24:36+05:30 IST

ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా తెస్తామని, కేంద్రం మెడలు వంచి విభజన హామీలు అమల య్యేలా చేస్తామన్న జగన్‌ వాటి ఊసే లేకుండా చేశారని రాజధాని రైతులు, మహిళలు తెలిపారు.

ప్రత్యేక హోదాను మరిచారు
మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి గాలిగోపురం వద్ద నినాదాలు చేస్తున్న వెలగపూడి రైతులు

మూడు ముక్కలతో అమరావతి నాశనం 

398వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు


తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, జనవరి 18: ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా తెస్తామని, కేంద్రం మెడలు వంచి విభజన హామీలు అమల య్యేలా చేస్తామన్న జగన్‌ వాటి ఊసే లేకుండా చేశారని రాజధాని రైతులు, మహిళలు తెలిపారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తోన్న ఆందోళనలు సోమవారం తో  398వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు ధర్నా శిబిరాల నుంచి మాట్లాడుతూ ప్రత్యేక హోదా రాష్ట్రానికి అవసరమని ప్రతి ఒక్కరూ  చెపుతుంటే ఆ సంగతి వదిలేసిన పాలకులు మూ డు రాజధానులు అంటూ అమరావతిని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మీద కక్ష కట్టి మూడు ముక్కల ఆట మొదలు పెట్టారన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మార్చుతారా అని ప్రశ్నించారు. దేశానికి కూడా మూడు రాజధానులు ఉండాలంటూ సీఎం జగన్‌  ప్రతిపాదన చేయాలన్నారు. కేంద్రం నుంచి వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుస్తుందన్నారు.  మూడు రాజధానులు ప్రతిపాదన అట కెక్కించి అమరావతిని అభివృద్ధి చేయాలని డిమాండు చేశారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా దీక్షా శిబిరాల్లో రైతులు నివాళులు అర్పించారు. తు ళ్లూరు మండల పరిధిలోని రాజధాని గ్రామాలతో పాటు మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్ర బాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ, తాడేపల్లి మండలం పెనుమాక గ్రామా ల్లో రైతులు చేపట్టిన దీక్షలు 398వ రోజుకు చేరా యి. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండంల పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు, మహిళలు సోమవారం నిరసనలు కొనసాగించారు.   


అమరేశ్వరుడికి పూజలు

అమరావతి: అమరావతిలోని అమరేశ్వరస్వామి ఆలయాన్ని సోమవారం రాజధాని పరిధిలోని వెల గపూడి గ్రామానికి చెందిన రైతులు  సందర్శించి అమరావతి రాజధానిని కొనసాగించా లని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాలి గోపురం వద్ద మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు.


అమరావతి కోసం యాగం

అమరావతికి దైవబలం చేకూరాలని, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని తాళ్లాయపాలెం శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి నేతృత్వంలో శ్రీ విద్యాయాగం చేపట్టారు. ప్రధాని మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండ్రాయుని పాలెంలో యాగం నిర్వహించాలని నిర్ణయించగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో తాళ్లాయపాలెం శైవక్షేత్రానికి యాగ కార్యక్రమం మారింది. సోమవారం ఈ కార్యక్రమాన్ని చేప ట్టారు. 108 మంది దంపతులు యాగ పక్రియలో పాల్గొంటున్నట్టు శివస్వామి తెలిపారు. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Updated Date - 2021-01-19T05:24:36+05:30 IST