న్యాయస్థానాలే దేవాలయాలు

ABN , First Publish Date - 2020-11-30T05:22:42+05:30 IST

న్యాయస్థానాలే మా దేవాలయాలు, న్యాయమూర్తులే మా దేవుళ్లు.. అని రాజధానికి భూములిచ్చిన రైతులు పేర్కొన్నారు.

న్యాయస్థానాలే దేవాలయాలు
తుళ్లూరు రైతు దీక్ష శిబిరంలో కార్తీక దీపారాధనలు

న్యాయమూర్తులే మా దేవుళ్లు..

348వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళనలు


తుళ్లూరు, తాడికొండ, తాడేపల్లి, మంగళగిరి, నవంబరు 29: న్యాయస్థానాలే మా దేవాలయాలు, న్యాయమూర్తులే మా దేవుళ్లు.. అని రాజధానికి భూములిచ్చిన రైతులు పేర్కొన్నారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు ఆదివారం 348వ రోజుకు చేరుకున్నాయి. అనంతవరం, నెక్కల్లు, పెదపరిమి, మందడం, నేలపాడు, ఐనవోలు, తుళ్లూరు, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, రాయపూడి, దొండపాడు, అబ్బురాజుపాలెం, బోరుపాలెం తదిర గ్రామాల్లోని రైతు శిబిరాల్లో ఆందోళనలు కొనసాగించారు. ఈ సందర్భంగా రైతులు మా ట్లాడుతూ న్యాయం అడిగితే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసం 33వేల ఎకరాలు త్యాగం చేస్తే తమను నడి రోడ్డుపై నిలబెట్టారని తెలిపారు. ఈ రాక్షసపాలనలో న్యాయ స్థానాలు లేకపోతే తాము అన్యాయం అయిపోయే వారమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని నాశనం చేస్తుంటే బీజేపీ వారు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. మం గళగిరి మండలం కృష్ణాయపా లెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పలువురు రైతుసంఘ నేతలు సం దర్శించి మద్దతు తెలిపారు. మూడు రాజధానులకు వ్యతిరేకం గా  మోతడకలో రైతులు, మహిళలు నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయ కుండా మూడు రాజధానుల పేరిట రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదన్నారు. అమరావతిలో అభివృద్ధి ఆగిపోవటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ ప్రభావం చూపిందన్నారు. దీనిని సీఎం గ్రహించి మూడు రాజధానుల ప్రక టనను వెనక కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి మండలం పెనుమా కలో ఐకాస ఆధ్వర్యంలో రైతుల నిరసన దీక్షలు  కొనసా గాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా మందడం దీక్ష శిబిరంలో లక్ష ఒత్తులతో  దీపారాధనలు చేసి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. తుళ్లూరు శిబిరంలో గోమాతకు పూజలు చేశారు. అమరావతిని కాపాడండి అంటూ అమరేశ్వరుడిని వేడుకున్నారు.


Updated Date - 2020-11-30T05:22:42+05:30 IST