ఇష్టం వచ్చినట్లు పాలన

ABN , First Publish Date - 2020-11-28T05:15:53+05:30 IST

ప్రజలు ఇచ్చిన అధికారంతో ఇష్టమొచ్చినట్లు పాలన చేస్తున్నారని రాజధాని రైతులు ధ్వజమెత్తారు.

ఇష్టం వచ్చినట్లు పాలన
మందడం శిబిరంలో నినాదాలు చేస్తున్న మహిళలు, రైతులు

346వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు

తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, నవంబరు 27: ప్రజలు ఇచ్చిన అధికారంతో ఇష్టమొచ్చినట్లు పాలన చేస్తున్నారని రాజధాని రైతులు ధ్వజమెత్తారు. అమరావతి కోసం చేస్తోన్న ఉద్యమం శుక్రవారంతో 346వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సంక్షే మం కోసం పని చేసే వారైతే, ప్రజల భావాలకు అనుగుణంగా పాలించేవారన్నారు. అమరావతిలో ఏ ఒక్క అభివృద్ధి పని చేపట్టక నిస్తేజం చేశారన్నారు. 


రైతులను అడ్డుకున్న పోలీసులు

అసైన్డ్‌ రైతులకు కౌళ్లు జమ చేయాలని కోరేందుకు ఉద్దండ్రాయునిపాలెం శిబిరం నుంచి జోరు వానలో సచివాలయం వెళ్తున్న వారిని పోలీసులు సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపై అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. క్యాబినెట్‌ సమావేశం జరుగుతున్న సందర్భంగా కౌలు సమస్యలను చెప్పుకోవడానికి సచివాలయానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారని దళిత జేఏసీ సభ్యుడు పులి చిన్నా తెలిపారు. 

     - మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో, తాడేపల్లి మండలం పెనుమాకలో రైతులు చేపట్టిన దీక్షలు 346వ రోజుకు చేరాయి. తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో నిరసనలు కొనసాగించారు.   


Updated Date - 2020-11-28T05:15:53+05:30 IST