పాలనా వికేంద్రీకరణతో నాశనం

ABN , First Publish Date - 2020-11-25T04:51:52+05:30 IST

పాలనా వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారంటూ పాలకులపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాలనా వికేంద్రీకరణతో నాశనం
యర్రబాలెం దీక్షా శిబిరంలో నిరసనలు

ఒప్పందం ప్రకారం అభివృద్ధి చేయాలి  

343వ రోజు ఆందోళనల్లో అమరావతి రైతులు


తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, నవంబరు 24: పాలనా వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారంటూ పాలకులపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలని రైతులు చేస్తోన్న ఆందోళనలు  మంగళవారంతో 343వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒప్పందం, మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అమరావతిని అభివృద్ధి చేసిన తరువాత, మూడు కాదు 30 రాజధానులు పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేయండని మండిపడ్డారు. దేశానికి కూడా మూడు రాజధానులు కావాలని అడిగితే పెడతారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఒక రాజఽధాని కాక పలు రాజధానులు ఉంటాయా? ఒక దానికే టికానా లేదు, మూడు కట్టి అభివృద్ధి చేస్తారా అని రాజధాని దళిత జేఏసీ నేతలు మార్టి న్‌ ముళ్లమూడి రవి, పులి చిన్నా ప్రశ్నించారు. పెయిడ్‌ ఆర్టిస్టులకు రాజధానిలో పనేమిటని, వారి ప్రాంతాలలో మూడు  రాజధానుల కోసం ఆందోళ నలు చేసుకో వాలన్నారు. మూడు ముక్కల ఆటతో ఇప్పటికే రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగించారు.


-   మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడ మర్రు, నీరుకొండ గ్రామాల్లో రైతుల దీక్షలు 343వ రోజుకు చేరాయి. యర్ర బాలెంలోని శిబిరాన్ని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి సందర్శించి సంఘీ భావం తెలి పారు. రాజధానిగా అమరావతి ఒక్కటే ఉంటుందని, రాష్ట్ర ప్రజలు అండగా ఉంటారన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జయసత్య, టీడీపీ నాయకులు బాపనయ్య, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


  - తాడేపల్లి మండలం పెనుమాకలో జరుగుతున్న రైతుల  దీక్షలు 343వరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఐకాస ప్రతినిధులు మాట్లాడుతూ మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఒకే రాజధాని అమరావతి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలన్నారు. దీక్షలలో ఐకాస నేతలు, స్థానిక రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


- మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం మోతడకలో రైతులు, మహిళలు మంగళవారం నిరసనలు కొనసాగిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ 343 రోజులుగా రాజధాని ప్రాంతంలో రైతులు, మహి ళలు పోరాటం చేస్తుంటే ప్రభుత్వం పట్టీపట్ట నట్లుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్రా న్ని అభివృద్ధి చేయ కుండా, సామాన్యులపై రక రకాల పన్నులతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

Updated Date - 2020-11-25T04:51:52+05:30 IST