Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 12 Nov 2021 16:41:19 IST

సినిమా రివ్యూ: రాజావిక్రమార్క

twitter-iconwatsapp-iconfb-icon

సినిమా రివ్యూ : రాజావిక్రమార్క

విడుదల తేదీ : 12, నవంబర్ 2021

నటీనటులు : కార్తికేయ, తాన్యా రవిచంద్రన్, సుధాకర్ కోమాకుల, తనికెళ్ళ భరణి, సాయికుమార్, హర్షవర్ధన్, పశుపతి, తదితరులు

ఎడిటర్ : జస్విన్ ప్రభు

కెమెరా : పిసీ మౌళి

సంగీతం : ప్రశాంత్ ఆర్.విహారి

సమర్పణ : ఆదిరెడ్డి టి

నిర్మాత : రామారెడ్ది

రచన, దర్శకత్వం : శ్రీ సరిపల్లి


‘ఆర్.ఎక్స్ 100’ చిత్రంతో కార్తికేయ టాలీవుడ్‌లో హీరోగా సక్సెస్ ఫుల్‌గా ఎస్టాబ్లిష్ అయ్యారు. తొలి చిత్రమే సంచలన విజయం సాధించడంతో పాటు నటుడిగా కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే ఆ తర్వాత కార్తికేయ వరుస ఆఫర్స్ అందుకున్నప్పటికీ.. ఆ సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’ ఈ రోజే (శుక్రవారం) థియేటర్స్‌లో విడుదలైంది. మరి ఈ సినిమాతో ఆయన ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారు? అసలు ఆ సినిమాలో ప్రేక్షకుల్ని అలరించే అంశాలేంటి? అనే విషయాలు రివ్యూలో తెలుసుకుందాం.


కథ:

విక్రమ్ (కార్తికేయ) ఎన్ఐఏలో కొత్తగా చేరిన ఉద్యోగి. తన సుపీరియర్ ఆఫీసర్ మహేంద్ర (తనికెళ్ళభరణి)ని బాబాయ్ అనేంతగా అతడికి ఆయన దగ్గర చనువుంటుంది. హైదరాబాద్‌ను అడ్డాగా చేసుకొని అక్రమ ఆయుధాలు సరఫరా చేసే నైజీరియన్‌ను ఎన్ఐఏ బృందం పట్టుకుంటుంది. అతడిని విచారించే క్రమంలో విక్రమ్ చేతిలో ఉన్న గన్ పొరపాటున పేలి అతడు చనిపోతాడు. అయితే మరణించే ముందు మాజీ నక్సలైట్ నాయకుడు గురునారాయణ (పశుపతి)ని చూశానని చెబుతాడు. అతడి వల్ల హోమ్ మినిస్టర్ చక్రవర్తి (సాయికుమార్)కి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? వారిద్దరి మధ్య గతంలో ఉన్న శత్రుత్వానికి కారణమేంటి? గురు నారాయణ ను ఎన్ఐఏ ఎలా అడ్డుకుంది? విక్రమ్‌కి, హోమ్ మినిస్టర్ కూతురు కాంతి(తాన్యా రవిచంద్రన్) కి మధ్య రిలేషన్ ఏంటి? చక్రవర్తిని కాపాడే క్రమంలో జరిగిన పరిణామాలేంటి? అనేది మిగతా కథ.

విశ్లేషణ:

‘నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ’ అనేది కేవలం తీవ్రవాదుల్ని పట్టుకొనే ఓ ప్రత్యేక ఏజెన్సీ. నేషనల్ లెవెల్లోని మిషన్స్‌లో వారి పనితనం ఎలా ఉంటుంది? అనే విషయాలు గతంలో వచ్చిన ‘వైల్డ్ డాగ్’, ‘గరుడవేగ’ లాంటి సినిమాల్లో చాలా డీటెయిల్డ్‌గా చూపించారు. అయితే ‘రాజావిక్రమార్క’ చిత్రంలో ఎన్ఐఏ రాష్ట్రంలోని మిషన్స్‌ను కూడా టేకప్ చేస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు శ్రీ. అయితే ఆ చెప్పే విధానాన్ని పూర్తిగా సిరీయస్‌గా చూపించి ఉంటే.. బాగానే ఉండేది. కార్తికేయ లాంటి హీరో ఉండడం వల్లనో ఏమో ..  హోం మినిస్టర్‌ని కాపాడే మిషన్‌ను కామెడీ యాంగిల్‌లో ప్రెజెంట్ చేశారు. సెకండాఫ్ నుంచి కథనాన్ని సీరియస్ గా తీసుకెళ్ళే ప్రయత్నంలో కథలో కొంత డిస్ట్రబెన్స్ ఏర్పడింది. మధ్యలో హోం మినిస్టర్ కూతురితో విక్రమ్ ప్రేమాయణం, కామెడీ ప్రహసనం, కన్ఫ్యూజన్ డ్రామా లాంటివన్నీ కథను కాస్తంత డీవియేట్ చేశాయి. ఫస్టాఫ్ పూర్తిగా కార్తికేయ కామెడీ సీన్స్ తో ఎంగేజ్ చేసి.. ఇంటర్వెల్ దగ్గర ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్ మీద ఆసక్తిని క్రియేట్ చేశారు దర్శకుడు. 


సెకండాఫ్ నుంచి కథనం పూర్తిగా సీరియస్ వేలో సాగుతుంది. కొన్ని మలుపులతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే ప్రయత్నం జరిగింది. అయితే కాస్తంత రేసీగా ఉండి ఉంటే ఇంకా బాగుండేది. అయితే ఇందులోని కొన్ని సన్నివేశాలు ఇదివరకు కొన్ని సినిమాల్లో చూసినట్టుగా అనిపిస్తాయి. ముఖ్యంగా సుధాకర్ కోమాకుల చేసిన పోలీస్ పాత్రను సినిమాకే హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. క్రాక్ చిత్రంలో కానిస్టేబుల్‌గా మంచి పేరు తెచ్చుకున్న సుధాకర్‌ ఇందులో ఏసీపీగా నటించారు. దర్శకుడు ఇందులో ప్రత్యేకత ఉండాలనుకున్నాడో ఏమో.. అతడి పాత్రకి ఓ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. అతడి పాత్ర పర్వాలేదనిపిస్తుంది. ఇక విక్రమ్‌గా కార్తికేయ తనదైన శైలిలో మంచి ఈజ్‌తో, గత చిత్రాల్లోని డిక్షన్‌తో మెప్పించారు. ఒక సన్నివేశంలో అతడు సిక్స్ ప్యాక్‌తో కనిపిస్తారు. అలాగే,  అతడి కామెడీ టైమింగ్ కూడా బాగుంది. కథానాయికగా తాన్యా రవిచంద్రన్ ఆకట్టుకుంటుంది. గురునారాయణగా పశుపతి, హోమ్ మినిస్టర్‌గా సాయికుమార్, యన్.ఐ.ఏ చీఫ్‌గా తనికెళ్ళ భరణి, హర్షవర్ధన్  తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఇందులో టెక్నికల్ టీమ్ బాగా కుదిరింది. పీసీ మౌళి సినిమాటోగ్రఫీ, ప్రశాంత్ విహారి సంగీతం బాగా కుదిరాయి. మొత్తం మీద రాజావిక్రమార్కలో కొన్ని రొటీన్ సన్నివేశాలున్నప్పటికీ.. యన్.ఐ.ఏ బ్యాక్ డ్రాప్‌లో తీయడం వల్ల.. ఇన్వెస్టిగేషన్, ట్విస్ట్స్ ప్రేక్షకుల్ని బాగానే అలరిస్తాయి. యాక్షన్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవారికి ఈ సినిమా చక్కటి కాలక్షేపం.

ట్యాగ్‌లైన్: కొంత థ్రిల్లింగ్.. కొన్ని నవ్వులు


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement