తానా మహాకవి సమ్మేళనానికి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి

ABN , First Publish Date - 2021-04-05T14:31:00+05:30 IST

గుంటూరు రేపల్లె మైనేనివారిపాలెంలో జన్మించి బేగంపేట పబ్లిక్‌స్కూల్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన రాజావాసిరెడ్డి మల్లీశ్వరికి తానా వారు ఈనెల 10న ప్రపంచసాహిత్య చరిత్రలో ప్రతిష్టాత్మకంగా, అపూర్వంగా నిర్వ

తానా మహాకవి సమ్మేళనానికి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి

హైదరాబాద్ : గుంటూరు రేపల్లె మైనేనివారిపాలెంలో జన్మించి బేగంపేట పబ్లిక్‌స్కూల్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన రాజావాసిరెడ్డి మల్లీశ్వరికి తానా వారు ఈనెల 10న ప్రపంచసాహిత్య చరిత్రలో ప్రతిష్టాత్మకంగా, అపూర్వంగా నిర్వహించే అక్షరయజ్ఞం మహాకవిసమ్మేళనంలో పాల్గొనే అవకాశం దక్కింది. విద్యార్థి దశనుంచి సాహితీరచన చేస్తున్న మల్లీశ్వరి నవల, బాల సాహిత్యం మొదలు భాషా సాహిత్య పరిశోధనా వ్యాసాలు, గజళ్ల వరకు దాదాపు పది పన్నెండు సాహితీప్రక్రియల్లో రచనలు చేశారు. మల్లీశ్వరి సాహితీపిపాసను గుర్తించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉగాది సాహితీ పురస్కారంతో సత్కరించింది. తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ, భారత కల్చరల్‌ అకాడమీ వారు విశిష్ట సాహితీ సేవా రత్న పురస్కారాలు అందజేశారు. తనను మహాకవిసమ్మేళనానికి ఆహ్వానించిన తానా అధ్యక్షుడు తాళ్లూరి జయప్రసాద్‌, సమన్వయకర్త చివురుమళ్ల శ్రీనివాసరావు, వేదిక నిర్వాహకులు తోటకూర ప్రసాద్‌, శిరీషకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.


Updated Date - 2021-04-05T14:31:00+05:30 IST