రాజకాలువ అభివృద్ధికి రూ.1500 కోట్లు విడుదల

ABN , First Publish Date - 2022-06-10T16:11:08+05:30 IST

బెంగళూరు నగరంలోని రాజకాలువ అభివృద్ధికి గాను ప్రభుత్వం రూ 1500 కోట్ల గ్రాంటను విడుదల చేసింది. రెవెన్యూశాఖా మంత్రి ఆర్‌ అశోక్‌

రాజకాలువ అభివృద్ధికి రూ.1500 కోట్లు విడుదల

                    - నగరంలో తీరనున్న వరద కష్టాలు


బెంగళూరు, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు నగరంలోని రాజకాలువ అభివృద్ధికి గాను ప్రభుత్వం రూ 1500 కోట్ల గ్రాంటను విడుదల చేసింది. రెవెన్యూశాఖా మంత్రి ఆర్‌ అశోక్‌ గురువారం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. రాజకాలువ ప్రాంతంలోని కబ్జాలను తొలగించి కాలువను ఆధునికీకరించడం, పూడికలు తీయడం వంటి కార్యక్రమాలకోసం ఈ నిధులను ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. మొత్తం మూడు దశల్లో రాజకాలువ అభివృద్ధి పనులను చేపట్టబోతున్నామన్నారు. ఇందులో ప్రాథమిక దశలో అభివృద్ధి పనులకోసం రూ 1005.12 కోట్లు ఖర్చు చేయనుండగా రెండో దశలో పనులకోసం రూ481.88 కోట్లను ఖర్చుచేస్తామన్నారు. రాజకాలువ ప్రవహించే బెంగళూరులోని మొత్తం 8 డివిజన్లలోనూ ఏకకాలంలో పనులను ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. రెండు దశల అభివృద్ధి అనంతరం మూడో దశ అభివృద్ధి నిర్వహణ బాధ్యతను బీబీఎంపీకి అప్పగించడం జరుగుతుందని మంత్రి వివరించారు. రాజకాలువ ఆధునికీకరణ పూర్తయితే నగరంలో ఎంత భారీ వర్షం పడినా లోతట్టు ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం ఉండదన్నారు.

Updated Date - 2022-06-10T16:11:08+05:30 IST