రాజా లేకుండా రాజానగరంలో తిరగనీయం

ABN , First Publish Date - 2021-09-19T05:35:58+05:30 IST

ఎమ్మెల్యే జక్కంపూడి రాజా లేకుండా రాజానగరం నియోజకవర్గంలో ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ తిరనీయబోమని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుమలశెట్టి సత్యనారాయణ, నక్కా రాంబాబు, క్రోవీడ్‌ సర్రాజు హెచ్చరించారు.

రాజా లేకుండా రాజానగరంలో తిరగనీయం

  • వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుమలశెట్టి

కోరుకొండ, సెప్టెంబరు 18: ఎమ్మెల్యే జక్కంపూడి రాజా లేకుండా రాజానగరం నియోజకవర్గంలో ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ తిరనీయబోమని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుమలశెట్టి సత్యనారాయణ, నక్కా రాంబాబు, క్రోవీడ్‌ సర్రాజు హెచ్చరించారు. నియోజకవర్గంలోని కోరుకొండ, రాజానగరం, సీతానగ రం మండలాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం సమావేశాలు నిర్వహించారు. కోరుకొండ హరేరామ సమాజ ఆవరణలో కన్వీనర్‌ బుల్లిబుచ్చి బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తిరుమలశెట్టి మాట్లాడుతూ గత పార్ల మెంట్‌ ఎన్నికలకు 100 రోజుల ముందు బీసీ కార్డు ఉపయోగించి పార్టీలోకి వచ్చి రెడీమేడ్‌ ఎంపీ అయిన సంగతి మర్చిపోయారా అన్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాణం పెట్టే జక్కంపూడి కుటుంబాన్ని విమర్శించే అర్హత ఎంపీకీ లేదన్నారు. వెలుగుబంద భూ తగాదా, సీతానగరం అధ్యాపకుడి గొడవ లకు సంబంధించి వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించిన ఘనత ఎంపీదని అన్నారు. గుమ్ముళ్ళూరు సర్పంచ్‌ నక్కా రాంబాబు మాట్లాడుతూ బూరుగుపూ డిలో ఇప్పటికీ ఎకరాకు రూ.25 లక్షలకు మించని  భూమిని అధిక ధరలకు కొనిపించి అవినీతికి పాల్పడిన ఎంపీ తమకు నీతులు చెబుతారా అని ప్రశ్నిం చారు. 2011 నుంచి ఇప్పటివరకు అహర్నిశలు కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత జక్కంపూడి కుటుంబానిది అన్నారు. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ ఇతర ప్రతిపక్ష నాయకులతో ఎంపీ కలిసి పని చేస్తున్నారని ఆరోపించారు. కరోనా పేరుతో ఎమ్మెల్యే జక్కంపూడి రూ.15 కోట్లు వసూలు చేశారన్న మాజీ ఎమ్మెల్యే పెందుర్తి ఆరోపణలను ఖండించారు. సమావేశంలో అడబాల సీతారామకృష్ణ, కర్రి నాగేశ్వరరావు, పిట్టా కృష్ణ, గొల్లపల్లి ప్రవీణ్‌, అడ పా కుమార్‌, తోరాతి శ్రీను, మారిశెట్టి నాయుడు, బొరుసు బద్రి, హరిశ్చంద్ర ప్రసాద్‌ రెడ్డి, శివయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-19T05:35:58+05:30 IST