Abn logo
Sep 21 2021 @ 12:32PM

బెయిలుపై విడుదలైన రాజ్ కుంద్రా

ముంబై: పోర్న్ చిత్రాల కేసులో సుమారు రెండు నెలల క్రితం అరెస్టయిన వ్యాపారవేత్త, శిల్పాషెట్టి భర్త రాజ్ కుంద్రా మంగళవారం ఉదయం ఆర్థర్ రోడ్డు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో రూ.50,000 ష్యూరిటీతో ముంబై కోర్టు ఆయనకు సోమవారం బెయిలు మంజూరు చేసింది. లాంఛనాలు పూర్తి చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. కుంద్రాకు బెయిల్ మంజూరైన కొద్ది గంటలకే శిల్పాశెట్టి ఆ విషయాన్ని నేరుగా ప్రస్తావించకుండా ''గ్రహణం వీడితే మళ్లీ మంచిరోజులు వస్తాయనడానికి సంకేతమే ఇంద్రధనుస్సు'' అంటూ ఓ ట్వీట్ చేసింది.

శిల్లా షెట్టిని 2009 వివాహం చేసుకున్న రాజ్‌కుంద్రా జూలై 19న పోర్నోగ్రఫీ చిత్రాలు నిర్మించి, పబ్లిష్ చేస్తున్నారనే ఆరోపణలపై అరెస్టయ్యారు. ఈ కేసులో విచారణ పూర్తయి, చార్జిషీటు దాఖలు చేసినందున తన కు బెయిలు మంజూరు చేయాలని శనివారంనాడు ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో తనను బలిపశువును చేశారని, కేసులో తప్పుగా ఇరికించారని, పోర్న్ చిత్రాల షూటింగ్‌లో తన ప్రమేయం ఉన్నట్టు ఎలాంటి సాక్ష్యాలు లేకున్నా తనపై చార్జిషీటు దాఖలు చేశారని బెయిల్ అభ్యర్థనలో కుంద్రా పేర్కొన్నారు. తన సొంత పనుల్లో బిజీగా ఉన్నందున తన భర్త వ్యాపార కార్యకలాపాల గురించి తనకేమీ తెలియదని శిల్పా షెట్టి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు ఛార్జిషీటులో పొందుపరిచారు. మొబైల్ అప్లికేష్లయిన 'హాట్ షాట్స్', 'బాలీ ఫేమ్' గురించి కూడా తనకు తెలియదని శిల్పా పేర్కొన్నారు. పోర్న్ రాకెట్‌కు ఈ రెండు మొబైల్ అప్లికేషన్లు లింక్ అయినట్టు పోలీసులు గుర్తించారు.

ఇవి కూడా చదవండిImage Caption