Abn logo
Sep 21 2021 @ 16:56PM

జైలు నుంచి బయటికి వస్తూ కంటతడిపెట్టిన Raj Kundra

ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా ఫోర్న్‌గ్రఫీ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. కుంద్రా రెండు నెలల సుదీర్ఘ సమయం తర్వాత ఈ రోజు జైలు నుంచి బెయిల్‌పై బయటికి వచ్చారు. నిన్న ఆయన బెయిల్ పిటిషన్ విచారించిన చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు రూ.50వేల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. దీంతో 2నెలల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ముంబైలోని అర్ధర్ రోడ్ జైలు నుంచి మంగళవారం ఉదయం 11.30 గంటలకు విడుదలయ్యారు. 


రాజ్‌కుంద్రా జైలు నుంచి వస్తున్న సమయంలో జైలు బయట గుమిగూడిన మీడియా ప్రతినిధులు ఫొటోలు తీస్తూ, ప్రశ్నలు సంధించడంతో ఆయన కంటతడి పెట్టుకున్నారు. రాజ్ కుంద్రా బయటకు వచ్చిన విషయాన్ని శిల్పాశెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘పడిలేచిన కెరటం’ అని క్యాప్షన్ తగిలించింది.